AP Rain Alert: భగభగమండే ఎండలతో మే మొదటి వారం వరకూ ఏపీలో వాతావరణం వేడెక్కిపోయింది. ఆ తరువాత మొదటి వారం తరువాత ఒక్కసారిగా వాతావరణం మారింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో పిడుగులు పడ్డాయి. తరువాత తిరిగి పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇప్పుడు మరోసారి వర్షసూచన జారీ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో ఇవాళ అల్లూరి జిల్లా పాడేరులో 57.5 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా కనిగిరిలో 52.5 మిల్లీమీటర్లు, సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో 46.5 మిల్లీమీటర్లు, బాపట్ల జిల్లా అద్దంకిలో 38.5 మిల్లీమీటర్లు, అల్లూరి జిల్లా కొయ్యూరులో 29.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం 27 ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి.


మరోవైపు ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో అత్యధికంగా 41.2 డిగ్రీలు, తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో 41.1 డిగ్రీలు, తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో 40.8 డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లెలో 40.6 డిగ్రీలు ఎన్టీఆర్ జిల్లా కొండూరులో 40.4 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా సారవకోటలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 


ఏపీలో ఇవాళ, రేపు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినాడ, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడనున్నాయి. అటు రాయలసీమ జిల్లాలో పిడుగులతో తేలికపాటి వర్షసూచన ఉంది. ఉరుములు, పిడుగుల ప్రమాదమున్నందున రైతులు, కూలీలు ఆరుబయట ఉండవద్దని, చెట్ల కింద అస్సలుండవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. 


Also read: AP Poll Percentage 2024: ఉద్రిక్తతలు, దాడుల మధ్య ప్రశాంతంగా ముగిసిన పోలింగ్



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook