Honor Killing: మానవత్వం మంట కలుస్తోంది. కుటుంబ బంధవ్యాలు పక్కదారి పడుతున్నాయి. జనాలు కసాయిలుగా మారుతున్నారు.చిన్న చిన్న విషయాలకే హత్యలకు తెగ బడుతున్నారు. తనవాళ్లను కూడా చంపేసే స్థాయికి దిగజారిపోతున్నారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కిరాతకాలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగిన పరువు హత్య కలకలం రేపింది. ఆ వెంటనే అనంతపురం జిల్లా ఉరవకొండలో అలాంటే ఘటనే జరిగింది. తాజాగా అనంతపురం జిల్లాలోనే మరో కిరాతకం వెలుగుచూసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతపురం జిల్లా కనగానపల్లిలో పరువు హత్య వెలుగుచూసింది. ముగ్గురు యువకులు పక్కా ప్రణాళికతో యువకుడిని కిడ్నాప్ చేసి.. గ్రామ శివారుకు తీసుకెళ్లి.. అత్యంత కిరాతకంగా గొంతు కొసి హత్య చేశారు. ఈ దారుణ ఘటనలో మహిళే కీలక సూత్రదారిగా ఉండటం కలకలం రేపుతోంది. తన కూతురు తమ కంటే తక్కువ కులానికి చెందిన అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందనే కసితో ఈ మర్డర్ కు ప్లాన్ చేసింది యువతి తల్లి.


పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కనగానపల్లికి చెందిన మురళి,  వీణ ప్రేమించుకున్నారు. ఇద్దరిది వేరువేరు కులం కావడంతో ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో లవర్స్ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనను జీర్ణించుకోలేని వీణ తల్లి.. అబ్బాయిని ఫోన్ చేసి బెదిరించింది. అయితే డ్యూటీకి వెళ్లిన మురళీ తిరిగి ఇంటికి వెళ్లలేదు. కంగారుపడ్డ వీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెతుకుతుండగానే.. గ్రామ శివారులో మురళీ మృతదేహం లభ్యమైంది. మురళీని గొంతుకోసి చంపేసి పడేశారు. తన భర్తను తన తల్లే హత్య చేయించిందని వీణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  మురళీ చనిపోవడంతో అతని తల్లిదండ్రులు అనాథలయ్యారు.


మురళీ హత్యతో స్థానికంగా ఉద్రిక్తత తలెత్తింది. మురళీ సామాజిక వర్గానికి చెందిన జనాలు ఆందోళన చేశారు. నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరువు హత్యను తీవ్రంగా ఖండించారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌. మాజీ మంత్రి పరిటాల సునీతను టార్గెట్ చేస్తూ  ఆయన ఆరోపణలు చేశారు. దీంతో పరువు హత్య ఘటన రాజకీయ రంగు పులుముకోవడంతో మరింత దుమారం రేగుతోంది.


Read also: Basara IIIT: సీఎం నుంచి లేఖ వస్తేనే కదిలేది! బాసరలో ఏడవ రోజు అదే ఉద్రిక్తత.. కేసీఆర్ కు సంజయ్ లేఖ..


Read also: TS Inter Results 2022 : ఆ రోజే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. tsbie.cgg.gov.inలో వివరాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook