AP Assembly Budget Session: జగన్ పై టీడీపీ ఎమ్మెల్యేల బెంగ, అసెంబ్లీకీ రాకపోవడంతో కూటమి ఎమ్మెల్యేల నారాజ్.!
AP Assembly Budget Session: ఏపీలో బడ్జెట్ సమావేశాలు చప్పగా సాగుతున్నాయా..? అసెంబ్లీలో వార్ వన్ సైడ్ గా మారిందా..? అసెంబ్లీలో ఏదో మిస్ అవుతున్నట్లు అధికార పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారా..? చంద్రబాబు ప్రసంగం తప్పా అసెంబ్లీలో పెద్దగా ఏమీ లేదనే అభిప్రాయంలో కూటమి ఎమ్మెల్యేలో ఉందా..? ఎలాగైనా జగన్ ను అసెంబ్లీకీ రప్పిస్తే బాగుండు అని కూటమి నేతలు భావిస్తున్నారా..?
AP Assembly Budget Session: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో సారి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అందునా రాష్ట్రానికి సంబంధించిన కీలక బడ్జెట్ సమావేశాలు కావడంతో మరింత ఆసక్తికరంగా మారాయి. ఐతే అసెంబ్లీలో కేవలం కూటమి నేతలు తప్పా ప్రతిపక్ష వైసీపీ హాజరుకావడం లేదు. దీంతో అసెంబ్లీ సమావేశాలు చాలా చప్పగా కొనసాగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలంటేనే అధికార,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం కొనసాగుతుందనే అభిప్రాయం నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు చాలా సాధారణంగా జరగుతున్నాయని ఏపీలో చర్చ జరుగుతుంది.
అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భంలో తప్పా మిగితా నేతలు మాట్లాడితే లైవ్ ప్రసారాలు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే ఏపీ అసెంబ్లీ సమావేశాల కవరేజ్ ను మీడియా కూడా పెద్దగా పట్టించుకున్నట్లు లేదనే ప్రచారం ఉంది. మధ్యలో డిప్యూటీ స్పీకర్ గా రఘురామ రాజు బాద్యతలు తీసుకునే సమయంలో కాస్తా హడావుడి జరిగినా తర్వాత మళ్లీ యధాస్థితికి చేరింది. అసెంబ్లీ సమావేశాలు ఇలా ఏకపక్షంగా సాగుతుండడంపై కూటమి ఎమ్మెల్యేలు కుంగిపోతున్నారు. తమ అధికార బలాన్ని ప్రతిపక్షంపై చూపించే ఒకే ఒక్క అవకాశం అసెంబ్లీ .అలాంటి అసెంబ్లీలో ప్రతిపక్షం ఎమ్మెల్యేలు లేకపోవడంతో తెగ ఫీలవుతున్నార కూటమి ఎమ్మెల్యేలు.
కూటమి ఎమ్మెల్యేల్లో కొందరు జగన్ ను అసెంబ్లీకీ రప్పించాలని నానా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. జగన్ ను ఏదో విధంగా రెచ్చగొడితే అసెంబ్లీకీ వస్తాడని ఎమ్మెల్యేలు అనుకున్నారు. కానీ జగన్ మాత్ర అసెంబ్లీకీ వచ్చేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. అసెంబ్లీకీ వస్తే అక్కడ ఏం జరుగుతుందో జగన్ కు తెలియక కాదు. గతంలో అసెంబ్లీలో జరిగిన పరాభావాలను టీడీపీ నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. జగన్ కనుక అసెంబ్లీకీ వస్తే జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతాం అన్నట్లుగా టీడీపీ ఎమ్మెల్యేలు కాచుకు కూర్చున్నారు. ఇలాంటి తరుణంలో జగన్ అసెంబ్లీకీ వెళ్లకపోవడమే మంచిదని వైసీపీ వర్గాల భావిస్తున్నాయి.
ఇక మరోవైపు ఏపీ శాసన మండలి సమావేశాలు మాత్రం కాస్తా కూస్తో రసవత్తరంగా సాగుతున్నాయి. కీలక మంత్రులు జగన్ పార్టీకీ కౌంటర్ ఇవ్వడానికి మండలిని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య మంత్రి లోకేశ్ కూడా మండలికి తరుచు వెళుతున్నారు. అక్కడే బొత్స, లోకేశ్ మధ్య హాట్ హాట్ గా మాటల యుద్దం నడిచింది. అసెంబ్లీలో తన తల్లిని అవమానపరిచారిన లోకేశ్ వైసీపీ చాలా సీరియస్ అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీనీ ఇరుకున పెట్టాలంటే అది మండిలో మాత్రమే సాధ్యమవుతుందని గ్రహించి కూటమి అక్కడనే వైసీపీనీ కార్నర్ చేస్తుంది.
దీంతో అసెంబ్లీ సమావేశాలు చప్పగా, మండలి సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయనే ప్రచారం ఏపీలో వినిపిస్తుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన దానిపై కేవలం అధికారం పక్షం మాత్రమే మాట్లాడింది తప్పా ప్రతిపక్షాల నుంచి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాన్ని వైసీపీ కోల్పోయింది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉంటాయో ఒక అంచనాకు రావచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికైతే అసెంబ్లీకీ సమావేశాలకు జగన్ హాజరు కావడం లేదు. భవిష్యత్తులో కూడా జగన్ హాజరయ్యేది ఇక అనుమానమే. దీంతో అసెంబ్లీలో జగన్ ను ఒక పట్టు పట్టాలనుకున్న ఎంతో మంది టీడీపీ ఎమ్మెల్యేల కలలు కల్లలు అయ్యాయి.
Also Read: Anganwadi: ఏపీ ప్రభుత్వం బంపర్ బొనాంజా.. అంగన్‌వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter