AP Assembly Budget Session: ఇవాళ ఏపీ అసెంబ్లీ బృడ్జెట్ సమావేశాలు కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఆ తరువాత ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం, విడుదల చేసిన నిధులు, అభివృద్ధి పనులు, కళాశాలల నిర్మాణం, విద్యారంగంలో సంస్కరణలు, గ్రోత్ రేట్, బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు సహా ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు గురించి కూడా గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అనంతరం ఉభయసభలు వాయిదా పడ్డాయి. 


అసెంబ్లీ సమావేశాల్ని 9 రోజుల పాటు నిర్వహించాలని..బడ్జెట్‌ను ఈ నెల 16వ తేదీన ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఛీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. 


ఇవాళ అంటే మార్చ్ 14న గవర్నర్ ప్రసంగం, బీఏసీ సమావేశం ముగిశాయి. మార్చ్ 15 బుధవారం  గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది. మార్చ్ 16న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చ్ 17 , మార్చ్ 18 తేదీల్లో అసెంబ్లీ బిజినెస్ సెషన్ ఉంటుంది. మార్చ్ 19 అదివారం సెలవైనా అసెంబ్లీ ఉంటుంది. తిరిగి మార్చ్ 20 సోమవారం సమావేశం జరుగుతుంది. మార్చ్ 21, 22 తేదీల్లో సెలవు ప్రకటించారు. మార్చ్ 22 బుధవారం ఉగాది సెలవు రోజు. మార్చ్ 23 గురువారం ఎంఎల్ఏ కోటా ఎంఎల్‌సి ఎన్నికలు జరగనున్నాయి. మార్చ్ 24వ తేదీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం చివరిరోజు.


బీఏసీ సమావేశం వివరాల్ని ఛీఫ్ విప్ ప్రసాద్ రాజు వెల్లడింారు. బడ్జెట్ సెషన్ కావడంతో  ఆదివారం సెలవు ఉండదన్నారు.  21, 22 తేదీల్లో మాత్రం సెలవు ప్రకటించామన్నారు. సంక్షేమం, అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేతను సైతం ఆహ్వానించామన్నారు. 


Also read: AP Assembly Session: ఇవాళ్టి నుంచే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ ఎప్పుడంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook