Andhra pradesh CM YS Jagan pressmet: దేశంలో ఎన్నికల ఫలితాలను ప్రజలు ఊహించని విధంగా ఇచ్చారు. ఇరు తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఏపీలో వైఎస్సార్సీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని వైనాట్ 175 అంటూ కూడా ప్రజల్లోకి వెళ్లారు. కానీ అనూహ్యంగా ప్రజలు.. కేవలం వైసీపీకి కేవలం 10 సీట్లు మాత్రమే ఇచ్చారు. వైఎస్సార్సీపీకి చెందిన అనేక మంది మంత్రులు కూడా ఘోరంగా ఓటమిని చవిచూశారు. ఇక ఏపీలో ముఖ్యంగా.. మంత్రుల నోటీదురుసు ఈ ఓటమికి కారణమని చెప్పుకొవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Snakes Video: బాప్ రే.. కింగ్ కోబ్రాకు షాంపుతో స్నానం... వీడియో వైరల్..


ఈ నేపథ్యంలో సీఎం జగన్ తన చివరి ప్రెస్ మీట్ ను ఏర్పాట్లు చేసి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.  ఇలాంటి ఫలితాలు కలలో కూడా ఊహించలేమని వైఎస్ జగన్ అన్నారు. గత ప్రభుత్వం హయాంలోని పథకాలలో చాలీ చాలని పెన్షన్ ను తాము పెంచామన్నారు. కోటీ ఐదు లక్షల మంది అక్కా చెల్లెమ్మలకు మంచి చేశామన్నారు. అవ్వాతాతలకు మంచి చేశారన్నాము. ఇచ్చిన ఏమాటను తప్పలేదని జగన్ అన్నారు. స్కూల్ లో పిల్లల చదువు కోసం.. ఏతల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా.. అనేక మార్పులు తీసుకొచ్చి అండగా ఉన్నామన్నారు.


ఇంత మంచి చేసిన ఓటమి పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్సురెన్స్, రైతన్నల ప్రేమ ఏమైందో అని సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మత్య్సాకార, రజకులు, నాయి బ్రాహ్మణులు, మ్యానిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసేది కాదని, ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత లా అమలు చేశామన్నారు. అయిన కూడా ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేమని అన్నారు.


Read more: Retired Soldier: విషాదకర ఘటన.. స్టేజీ మీద కుప్పకూలీన రిటైర్డ్ ఆర్మీ అధికారి.. వీడియో వైరల్..


ఏం జరిగిందో దేవుడికే తెలియాలి.. ప్రజల తీర్పు శిరసావహిస్తామన్నారు. పేదవాళ్లకు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నకూడా, ఓటమి పాలయ్యామని గద్గత స్వరంతో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. తమకు అండగా నిలిచిన..  ప్రతి నాయకుడికి, కార్యకర్తలకు,అక్కా చెల్లెమ్మలకు, స్టార్ క్యాంపెయినర్ లకు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంత చేసిన  కూడా నలభై శాతం అయిన ఓటు బ్యాంక్ సాధించలేకపోయామన్నారు. గుండె ధైర్యంతో మళ్లీ మీ ముందు కొస్తామన్నారు. గవర్నమెంట్ లో వచ్చిన వాళ్లకు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ విషేస్ చెప్పారు. ఎట్టకేలకు ప్రజాతీర్పును గౌరవిస్తామని సీఎం జగన్ గద్గత స్వరంతో మాట్లాడారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter