AP Legislative Council: శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకున్న ఏపీ సర్కార్
AP Assembly resolution to continue Legislative Council: ఏపీలో శాసనమండలిని రద్దు చేస్తూ గతేడాది తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.
AP Assembly resolution to continue Legislative Council: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనమండలి రద్దుకు చేసిన తీర్మానాన్ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు మంగళవారం శాసన సభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. అసెంబ్లీ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ఏపీలో శాసనమండలి కొనసాగనుంది. మండలి రద్దు తీర్మానం ఉపసంహరణకు మంత్రి బుగ్గన కారణాలు వెల్లడించారు.
శాసనమండలి (AP Legislative Council) రద్దు నిర్ణయం వల్ల కొన్ని కీలక అంశాల్లో ఇన్నాళ్లు ఒక సందిగ్ధత నెలకొందని... అందుకే మండలిని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు బుగ్గన తెలిపారు. కొత్త సభ్యుల రాకతో ఇకపై అసెంబ్లీ నిర్ణయాలకు అనుగుణంగా శాసనమండలి ముందుకెళ్తుందని భావిస్తున్నామన్నారు. 2019లో ప్రజా ప్రయోజనార్థం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు మండలి అడ్డుపడిందని అన్నారు. అసెంబ్లీలో చట్టాలు లేదా చట్టాలకు సవరణలు చేసినప్పుడు... మండలిలో దానికి సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
Also Read: అసెంబ్లీలో బీసీ జనగణన తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి వేణుగోపాల కృష్ణ
ప్రజల ద్వారా ఎన్నికైన శాసనసభ్యులే ఎప్పుడైనా సుప్రీమ్ అని... ప్రభుత్వం చేసిన చట్టాలకు జవాబుదారీగా ఉండాల్సింది అసెంబ్లీనే (AP Assembly) అని బుగ్గన పేర్కొన్నారు. కొన్ని రాష్ట్రాల్లో అసలు శాసనమండలి లేనే లేదని... ప్రజల కోసం మంచి చట్టాలు తీసుకురావాలన్నా, వాటిని సవరించాలన్నా... ఆ బాధ్యత అసెంబ్లీకే ఉంటుందని తెలిపారు. శాసనసభలో కూడా ఎంతోమంది విద్యావంతులైన సభ్యులు ఉన్నారని... మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వారికి కూడా ఉందని అన్నారు. అందుకే గతేడాది జనవరిలో మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేశామన్నారు. అయితే ఆ తీర్మానంపై కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాలేదన్నారు. దీంతో ఒక సందిగ్ధత నెలకొందని అన్నారు. ఇటీవలే శాసనమండలికి కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకున్నామని బుగ్గన (Buggana Rajendranath Reddy) గుర్తుచేశారు. ఇకపై అసెంబ్లీ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా మండలి సభ్యుల సలహాలు, సూచనలు ఉంటాయన్న ఆకాంక్షతో శాసనమండలిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook