AP Assembly Sessions Latest Updates: అందరూ అనుకున్నట్లే ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. గురువారం తొలిరోజే చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై తెలుగుదేశం పార్టీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. వెంటనే చర్చ జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళన చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని.. కేసులు ఎత్తివేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పైనా.. చంద్రబాబు అరెస్ట్‌పై సరైన ఫార్మాట్‌లో చర్చకు సిద్ధమంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రకటించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇక్కడ బల్లలు కొట్టడం కాదని.. దమ్ముంటే కోర్టులో బల్లలు కొట్టాలని బుగ్గన హితవు పలికారు. ఇక్కడ అరవడం కాదని.. వెళ్లి కోర్టులో వారి వాదనలను వినిపించాలని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరు సరిగా లేదని.. చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలయ్య మీసం తిప్పారు.


దీంతో వివాదం మరింత రంజకుంది. ఇక్కడ మీసం తిప్పడం కాదు.. సినిమాల్లో మీసాలు తిప్పుకోవాలంటూ మంత్రి అంబటి రాంబాబు బాలయ్యకు కౌంటర్ ఇచ్చారు. దమ్ముంటే రా అంటూ ఆయన సవాల్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడగొట్టి బాలకృష్ణకు సవాల్ విసిరారు. రా బయటకు చూసుకుందామన్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అనంతరం స్పీకర్ తమ్మనేని సీతారామ్ సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 
 
అంతకుముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ట మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులు, కేసులకు భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు అరెస్టు అంశంపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని అన్నారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదని..ప్రజల్లో తమ పార్టీకి ఉన్న క్రేజ్‌ను చూసే అక్రమ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చారు.


Also Read: Bigg Boss Season 7 Telugu: ఛీఛీ రతిక కూడానా.. ప్రిన్స్ యావర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బ్యూటీ   


Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook