ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా జరుగుతున్న బంద్‌తో రాష్ట్రంలో జనజీవనం స్తంభించిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రైవేటు వాహనాలు కూడా రోడ్లపైకి రావడంలేదు. అక్కడక్కడ మాత్రమే ఆటోలు కనిపిస్తున్నాయి. తిరుపతిలో కూడా బంద్ సంపూర్ణంగా జరుగుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతిలో ఆందోళనకారులు ఒక బైక్‌కు కూడా నిప్పు పెట్టారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


బంద్ ప్రశాంతంగా సాగాలి


ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న నేటి బంద్ ఎటువంటి హింసకు తావులేకుండా విజయవంతం చేయాలని హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. కొద్దిసేపటి క్రితం విలేకరులతో మాట్లాడిన ఆయన, హోదా సాధన సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. బంద్ సందర్భంగా ఎటువంటి హింస జరగకూడదని, ప్రశాంతంగా జరగాలని సూచించారు. అన్ని పార్టీలూ, సంఘాలు శాంతియుతంగా బంద్‌లో పాల్గొనాలని, శాంతియుతంగా నిరసనలు తెలియజేయాలని కోరారు.