వైఎస్ జగన్ పాలనపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడలో నిర్వహించి బీజేపీ సభ్యుత్వ నమెదు కార్యక్రమంలో కన్నా మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల మంది భాజపా సభ్యత్వం తీసుకున్నారని.. రానున్న రోజుల్లో వాటిని 25 లక్షలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జగన్ పాలనను వైఎస్ఆర్ పాలనతో పోల్చి విమర్శలు సంధించారు  కన్నా. 
ఇదా... రాజన్న రాజ్యం. !!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన గురించి ప్రస్తావిస్తూ  రాజన్న రాజ్యంలో ఎప్పుడూ పోలీసు పాలన చేయలేదని.. ప్రజా పాలనే చేశారని కన్నా వ్యాఖ్యానించారు.  రాజన్న పాలన అంటున్న జగన్ రాష్ట్రంలో పోలీసు పాలన చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ బయటకు చెబుతున్నది ఒకటి ..క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది మరోకటి అంటూ ఎద్దేవ చేశారు.
తొందరపాటు నిర్ణయాలు  !! 
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు.  గ్రామ వాలంటీర్ల వ్యవస్థ మరో జన్మభూమి కమిటీలాంటిదేనని ...వాటి ద్వారా అరాచకాలు జరిగే అవకాశముందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారని చెప్పారు. ఎన్నో ఆశలుతో ప్రజలు జగన్ ను గెలిపించారని.. అయితే ప్రజలకు విరుద్ధమైన పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు