ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా ఐదు ప్రశ్నలు వేస్తున్నామని.. వాటికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  కన్నా ప్రశ్నలను మీరూ చదవండి...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1)  2014 ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారు ?


2) సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు చేసిన తొలి వాగ్దానాలు అమలు చేశామని చెప్పగలరా ?


3) నాలుగేళ్ల పాలనలో ఎన్ని పరిశ్రమలు, ఉద్యోగాలు రాష్ట్రానికి   వచ్చాయో చెప్పగలరా?


4) జన్మభూమి కమిటీలతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన విషయాన్ని అంగీకరిస్తారా?


5) ఓటుకు నోటు కేసులో ‘బ్రీఫ్డ్ మీ’ అనే మాటలు మీవి కావని చెప్పగలరా? 


ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసిన  కన్నా లక్షీనారాయణ..ఇక నుంచి  ప్రతివారం ఐదు ప్రశ్నలు సంధిస్తానని పేర్కొన్నారు. కన్నా ప్రశ్నలకు సీఎం చంద్రబాబు ఏ మేరకు స్పందిస్తారనేది గమనార్హం.