హోదా ముగిసిపోయిన అంశం..దీనిపై చర్చ అనవసరం - ఏపీ బీజేపీ చీఫ్ కన్నా
ప్రత్యేక హోదాపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తనదైనశైలిలో స్పందించారు. నెల్లూరు పర్యటనలో ఉన్న ఆయన కావలిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమన్నారు. విభజన హామీలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్ర ఆర్థిక శాఖ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిందని... ఈ అఫిడవిట్ లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం మరోసారి స్పష్టం చేసిందన్నారు.
సాధ్యం కానీ హోదాపై చర్చ అనరవసరమని..ఏం చేస్తే ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తుందనే దానిపై బీజేపీకి క్లారిటీ ఉందన్నారు. కొందరు రాజకీయ లబ్ది కోసమే దీన్ని వాడుకుంటున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టండి...రాష్ట్ర ప్రజల కన్నీరు తుడిచి సుపరిపాలన అందిస్తామని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా హామీ ఇచ్చారు.