AP BJP: పురందేశ్వరికి చెక్ పెట్టేలా ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు..?
AP BJP New Chief: 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో పురంధేశ్వరి నేతృత్వంలో బీజేపీ మంచి ఫలితానే సాధించింది. అంతేకాదు ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నేత్రుత్వంలో పొత్తు కుదరడంలో కీ రోల్ పోషించారు. తాజాగా ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందకు బీజేపీ రంగం సిద్ధం చేస్తుందా అంటే ఔననే అంటున్నాయి ఏపీ బీజేపీ వర్గాలు.
AP BJP New Chief: ఆంధ్ర ప్రదేశ్ లో 2024లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా మంచి ఫలితాలనే రాబట్టింది. పోటీ చేసిన 10 అసెంబ్లీ సీట్లలో 8 సీట్లు.. 6 పార్లమెంట్ స్థానాలకు గాను 3 మూడింటిలో విజయం సాధించింది. స్వయంగా పురంధేశ్వరి.. రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచారు. అనకాపల్లినుంచి సీఎం రమేష్, అటు నర్సాపురం నుంచి గెలిచిన భూపతిరాజు శ్రీనివాసవర్మ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.అటు పురంధేశ్వరికి వివిధ ఈక్వేషన్స్ కారణంగా కేంద్రంలో పదవి దక్కలేదు. అయితే.. తాజాగా త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో పురంధేశ్వరికి మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయితో పాటు వివిధ రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులను నియమించాలి.
తాజాగా ఏపీ బీజేపీ సారథిగా ఉన్న పురంధేశ్వరి స్థానంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్య మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్లకు పట్టం కడుతోంది బీజేపీ. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీ నారాయణతో పాటు పురంధేశ్వరి లకు బీజేపీ అధ్యక్షబాధ్యతలు అప్పగించారు.తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నల్లారికి ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఏపీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను ఆకర్షించాలనేది బీజేపీ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. అందుకే కిరణ్ కుమార్ రెడ్డి వైపు భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.
అయితే అప్పట్లో జగన్ ను ఎదుర్కొనే క్రమంలో ఎన్నికల ముందు కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ బీజేపీ హై కమాండ్ పురంధేశ్వరి నేత్రుత్వంలో ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చింది. ఎన్నికల ముందు అధ్యక్షులను మారిస్తే క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళతాయనే ఉద్దేశ్యంతో ఆమెనే కొనసాగించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి బీజేపీ తరుపున ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరి కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తే.. ఆయన పార్టీ దశా, దిశను మారుస్తారా లేదా అనేది చూడాలి.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.