AP BJP: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రాజకీయ కుట్ర వెలుగుచూస్తోంది. బీజేపీలో టీడీపీ కోవర్టులున్నారా..అదెలా సాధ్యం. కానీ ఇది ముమ్మాటికీ నిజం. ఈ విషయంపై కేంద్ర నాయకత్వం ఇప్పుడు కన్నెర్ర జేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో బీజేపీ ఎవరి చేతిలో ఉంది. ఇక్కడి బీజేపీ మరో పార్టీ కోసం పనిచేస్తుందా అంటే ఇన్నాళ్లూ జరిగింది అదేనన్పిస్తోంది. మొన్నటివరకూ కీలకమైన రాజ్యాంగ పదవిలో ఉన్న పెద్దాయనకు పీఏగా పనిచేసిన సత్యకుమార్‌పై బీజేపీ అధినాయకత్వం ఇప్పుడు మండిపడుతోంది. ఏపీ బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టుల సంగతి కేంద్ర అధిష్టానానికి తెలిసిపోయింది. టీడీపీ కోవర్టులపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రంలోని బీజేపీ అధిష్టానం సన్నద్ధమైంది. 


ఓ పత్రికలో ఇటీవలి కాలంలో వస్తున్న కథనాలు కూడా ఇందుకు కారణం. అసంబద్ధమైన, అబద్ధపు రాతల్ని రాయిస్తూ ఓ పార్టీకు ప్రయోజనం చేకూర్చుతున్నాడనే ఆరోపణలున్నాయి. 30 ఏళ్లుగా కొనసాగుతూ..రాష్ట్రంలో బీజేపీని మరింతగా నిర్వీర్యం చేస్తూ..టీడీపీకు మార్గం సుగమం చేయడమే ప్రధాన ఉద్దేశ్యం. రాష్ట్ర బీజేపీను తమ చెప్పుచేతల్లో ఉంచుకుని..రాజకీయంగా, ఆర్ధికంగా లబ్ది పొందేందుకు కుట్ర జరిగిందనేది రాష్ట్ర బీజేపీ ఆరోపణ. 


కేవలం ఓ వ్యక్తి తనకు తాను బాహుబలిగా భావిస్తూ..టీడీపీకు అండగా ఉండే భరోసా కల్పిస్తున్నాడని ఆరోపణ. గతంలో ఆ పత్రికను రాష్ట్ర బీజేపీ నిషేధించినా సరే..ఆ వ్యక్తి కారణంగా టీడీపీ-బీజేపీ పొత్తుపై వార్తలు వస్తున్నాయి. ఈ వ్యక్తి గతంలో ఓ కేంద్రమంత్రి వద్ద కూడా పనిచేశాడు. అతని చేతలతో రాష్ట్ర బీజేపీను భ్రష్టు పట్టిస్తున్నారని ఏపీ బీజేపీ ఆరోపిస్తోంది. తెలుగుదేశం పార్టీకు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ అందిస్తూ వస్తున్నాడు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో టీడీపీ కూడా ఇబ్బంది పడుతోంది. 


ఏపీలో బీజేపీని జీరో చేయడం ద్వారా లేవకుండా చేయాలని..టీడీపీని బతికించాలనే లక్ష్యంతో ఆ వ్యక్తి వ్యవహరిస్తున్నాడు. తెలుగుదేశంతో పొత్తు ఉండదనే విషయాన్ని పార్టీ చాలాసార్లు చెప్పినా సరే..అలాంటి కథనాలను పదే పదే రాయించడం ద్వారా టీడీపీని బతికించే ప్రయత్నం చేస్తున్నాడని బీజేపీ ఆరోపించింది. టీడీపీ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా నియంత్రించడం, బీజేపీలోకి రాకుండా ఆపడం ఈ కుట్ర లక్ష్యమని బీజేపీ ఆరోపణ. 


ఈ పరిస్థితి గతంలో అంటే సోము వీర్రాజు కంటే ముందు చాలా ఎక్కువగా ఉండేదని సమాచారం. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికయ్యాక..రెండు వర్గాలుగా మారింది. బీజేపీలో ఓ వర్గం టీడీపీకు మద్దతుగా ఉంటే మరో వర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు మద్దతుగా నిలుస్తోంది. రాష్ట్ర బీజేపీ చేసిన ఈ ఆరోపణలపై బీజేపీ అధిష్టానం సైతం ఆగ్రహం వ్యక్తం చేసి..చర్యలు తీసుకునేందుకు సిద్ధమౌతోంది. 


Also read: Pawan Kalyan: అమెరికాలో పవన్ కల్యాణ్ సీక్రెట్ మీటింగ్స్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook