ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కీలక శక్తిగా ఎదగడానికి..బలమైన ప్రతిపక్షంగా మారడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఏపీ బీజేపీ ప్రతినిధుల బృందం..బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ( JP Nadda ) తో భేటీలో కీలకాంశాలు ప్రస్తావనకొచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ( Bjp Ram Madhav ) వ్యాఖ్యల ఆధారంగా ఏపీ బీజేపీ ( Ap Bjp ) ముందుకు పోతోంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ( Bjp president jp nadda ) ఏపీ బీజేపీ ప్రతినిధుల బృందం ( Ap bjp delegation team ) భేటీ అయింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు చర్చకొచ్చాయి.  రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు స్వీకరించాక చేపట్టిన జిల్లా పర్యటన వివరాలు, ప్రస్తుత పరిస్థితులు, వరద ప్రాంతాల్లో బీజేపీ నేతల పర్యటన వివరాల్ని జేపీ నడ్డాకు వివరించారు ఏపీ బీజేపీ నేతలు. నడ్డాను కలిసినవారిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ( Somu veerraju ), రాజ్యసభ సభ్యులు జివిఎల్ నర్శింహారావు తదితర కీలకనేతలున్నారు. బీజేపీ ప్రస్తుతం ఓ ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడుతున్నవైనాన్ని  జేపీ నడ్డాకు వివరించారు.  ఏపీలో మిత్రపక్షం జనసేనతో కలిసి రాష్ట్రంలో అధికారంలో రావాలనే సంకల్పంతో పనిచేయాలని..టీడీపీ, వైసీపీ అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బలంగా ఎదగాలని జేపీ నడ్డా సూచించారు. Also read: వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు