ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాజమహేంద్రవరం షల్టన్‌ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియెట్‌  రెండో సంవత్సారనికి  సంబంధించి జనరల్‌, వొకేషనల్‌ కోర్సులకు సంబంధించిన అన్ని ఫలితాలను ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష ఫలితాల్లో 84శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. 77శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు జిల్లా రెండో స్థానంలో ఉండగా, 76 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు  మూడో స్థానంలో ఉందన్నారు. ఈ ఫలితాల్లో 59శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో కడప ఉందన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ కూనం తేజవర్దన్ రెడ్డికి (992) రాగా, బైపీసీలో ముక్కు దీక్షిత (990) స్టేట్ ఫస్ట్ ర్యాంకును కైవసం చేసుకోవడం గమనార్హం. ఎంపీసీలో స్టేట్ సెకండ్ స్థానంలో ఆఫ్రాన్ షేక్ (991) నిలవగా, మూడో స్థానంలో వాయలపల్లి సుష్మా (990), బైపీసీలో స్టేట్ సెకండ్ స్థానంలో నారపనేని లక్ష్మి కీర్తి (990) నిలవడం గమనార్హం.


ఇటీవలే ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను విశాఖలోని ఏయూలో రేపు మధ్యాహ్నం విడుదల చేస్తారు.  రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా తొలిసారిగా ఫలితాలను టీవిలో చూసుకొనే అవకాశం కల్పించారు. పీపుల్స్ ఫస్ట్ సిటిజన్ యాప్, ఏపీ సీఎం కనెక్ట్ ఖైజాల యాప్‌లతో పాటు  https://apcfss.in వెబ్సైటులో కూడా ఫలితాలు చూడవచ్చు.


అదే విధంగా ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలు విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ ఇంటర్ బోర్డు సెకండియర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందూ. ఈ పరీక్షల కోసం 457,292 విద్యార్థులు నమోదు చేసుకున్నారు.