AP Cabinet: మావోయిస్టులపై నిషేధం పొడిగింపు..కృష్ణానదిపై కొత్త బ్యారేజ్ లు
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలకమైన అంశాలకు ఆమోదముద్ర వేసింది. రెండు కొత్త బ్యారేజ్ లు, అభివృద్ది ప్రాజెక్టులతో పాటు...ముఖ్యంగా మావోయిస్టులపై నిషేధాన్ని ఏడాదిపాటు పొడిగించింది.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ( Andhra pradesh cabinet ) పలు కీలకమైన అంశాలకు ఆమోదముద్ర వేసింది. రెండు కొత్త బ్యారేజ్ లు, అభివృద్ది ప్రాజెక్టులతో పాటు...ముఖ్యంగా మావోయిస్టులపై నిషేధాన్ని ఏడాదిపాటు పొడిగించింది.
సుదీర్ఘంగా సాగిన ఆంధ్రప్రదేశ్ విస్తృత స్థాయి కేబినెట్ సమావేశంలో పలు కీలకాంశాలపై నిర్ణయం తీసుకున్నారు. మరీ ముఖ్యంగా ఏపీలో మావోయిస్టుల ( Mavoist movements ) కదలికల్ని దృష్టిలో ఉంచుకుని మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ( Extension of ban on mavoist party ) రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధం మావోయిస్టు పార్టీతో పాటు దాని అనుబంధ సంస్థలపై కూడా ఉంటుంది. రాడికల్ యూత్ లీగ్ ( ఆర్‌వైఎల్), రైతు కూలీ సంఘం( ఆర్‌సీఎస్ ) లేదా గ్రామీణ పేదల సంఘం ( జీపీఎస్ ), రాడికల్ స్టూడెంట్ యూనియన్ ( ఆర్‌ఎస్‌యూ ), సింగరేణి కార్మిక సమాఖ్య ( సికాస ), విప్లవ కార్మిక సమాఖ్య ( వికాస ), ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ( ఏఐఆర్‌ఎస్‌ఎఫ్ )లు ఉన్నాయి.
మరోవైపు ఏపీ ఫిషరీస్ విశ్వవిద్యాలయాన్ని ( Fisheries university ) పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దిగువన 3 టీఎంసీల సామర్ధ్యంతో మరో రెండు చిన్న బ్యారేజ్ ( Two new barriages ) ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో 1350 కోట్ల ఖర్చుతో కృష్ణానదిపై చోడవరం వ ద్ద, 1280 కోట్ల ఖర్చుతో మోపిదేవి వద్ద మరో బ్యారేజ్ నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే విధంగా 15 వేల 380 కోట్లతో ఉత్తరాంధ్ర మెట్ట ప్రాంతాల కోసం బాబూ జగజ్జీవన్ రామ్ సుజల స్రవంతి పధకానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఈ పదకిం కింద 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. Also read:AP Cabinet: పలు కీలక నిర్ణయాలు...ఆన్ లైన్ లో రమ్మీ, పోకర్ లపై నిషేధం