AP Cabinet: రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం, మరి కాస్సేపట్లో అసెంబ్లీకు
AP Cabinet:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో బడ్టెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
AP Cabinet:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో బడ్టెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
కరోనా విపత్కర పరిస్థితుల నేపధ్యంలో అత్యవసర బడ్జెట్ సమావేశం (Ap Budget Session) ఏర్పాటైంది. అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. తొలిసారిగా మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ..తగిన కేటాయింపులు చేసింది. జెండర్ బేస్డ్ బడ్జెట్ ఏపీ ప్రజలు ముందు తీసుకొస్తోంది.ఈ బడ్జెట్‌కు కేబినెట్ (Ap Cabinet) ఆమోదం తెలిపింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనార్టీలతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికలు పొందుపరిచారు. 2021-22 సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనుంది.
ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభలో పలు సంతాప తీర్మానాలు ఉంటాయి. ఆ తరువాత స్పీకర్, ఛైర్మన్ అధ్యక్షతన బీఏసీ సమావేశాలు జరుగుతాయి. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ( Minister Kannababu) ప్రవేశపెట్టనున్నారు. అటు శాసనమండలిలో హోంమంత్రి సుచరిత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను మాత్రం మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెడతారు.
Also read: Black fungus treatment: ఆరోగ్యశ్రీ పరిధిలోకి బ్లాక్ ఫంగస్ చికిత్స
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook