AP Cabinet Today Meeting Highlights: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి బుధవారం సమావేశం అయింది. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమ్మ ఒడి పథకం అమలుకు ఆమోదం తెలపడంతోసాటు ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి, గ్రూప్‌-1, 2 పోస్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ  వివిధ శాఖల్లో 6,840 కొత్త పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 3,920 రిజర్వ్‌ పోలీసు ఉద్యోగాలు సహా కొత్త మెడికల్‌ కాలేజీలు, వివిధ విద్యాసంస్థలు, ఇతర శాఖల్లో పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సుమారుగా 10 వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు ఓకే చెప్పింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదేవిధంగా ఏపీ వైద్యవిధాన పరిషత్‌లో 14,658 మంది ఉద్యోగులకు మేలు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వీరంతా సొసైటీ పరిధిలో నుంచి ప్రభుత్వంలోకి చేరారు. ఉద్యోగులకు ఊరటనిస్తూ కొత్త జీపీఎస్‌ విధానానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జిల్లా కేంద్రాల్లోనూ ఒకే తరహా హెచ్‌ఆర్‌ఏ. జిల్లా కేంద్రాలన్నింటికీ కూడా  16 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలుకు  ఓకే చెప్పింది. ప్రకటించిన కొత్త డీఏ అమలుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 


మంత్రి మండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..


==> కొత్తగా జీపీఎస్‌ విధానం అమలు
==> CPS ఉద్యోగులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వ నిర్ణయం  
==> జీపీఎస్‌ ద్వారా ఆఖరు నెల జీతంలో 50 శాతం పెన్షన్.. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న డీఏ, డీఆర్‌ల తరహాలోనే GPS‌ పెన్షనర్లకు కూడా డీఆర్‌ వర్తింపు  
==> సీపీఎస్‌తో పోలికే లేకుండా జీపీఎస్‌ విధానం. 
==> రిటైర్డ్‌ ఉద్యోగులకు పూర్తి భద్రత నిచ్చేలా నిర్ణయాలు
==> 2014 జూన్‌ 2 నాటికి ఐదేళ్ల సర్వీసు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు అందరినీ క్రమద్ధీకరణ. 
==> 12వ పీఆర్సీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
==> పే రివిజన్‌ కమిషన్‌  ఏర్పాటుకు ఆమోదం 
==> ప్రతి మండలానికి రెండు జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు
==> ప్రతి మండలంలో జనాభా భారీగా ఉన్న రెండు పట్టణాలు లేదా గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడ హైస్కూళ్లను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలి  
==> ఇందులో ఒకటి ప్రత్యేకంగా బాలికల కోసం కాగా.. రెండోది కో–ఎడ్యుకేషన్‌ కోసం ఏర్పాటు చేయాలి  
==> ఆంధ్రప్రదేశ్‌ ఆధార్‌ ఆర్డినెన్స్‌–2023కు ఆమోదం
==> 28.35 ఎకరాలను 99 ఏళ్లపాటు చిత్తూరు డైరీ భూములను అమూల్‌కు లీజుకు ఇచ్చేందుకు ఓకే. 
==> కడప మానసిక వైద్యశాలలో కొత్తగా 116 పోస్టులు మంజూరుకు కేబినెట్‌ అంగీకారం.
==> వచ్చే ఏడాది మరో మూడు మెడికల్‌ కాలేజీలు సిద్ధం (పులివెందుల, పాడేరు, ఆదోని). 
==> ఈ మూడు కాలేజీల్లో 2118 పోస్టులను మంజూరుకు కేబినెట్‌ ఆమోదం
==> వైద్య విధాన పరిషత్‌ చట్టానికి సవరణలు చేస్తూ నిర్ణయం.
==> జూన్‌ 15న జిల్లా స్ధాయిలో జూన్‌ 17న రాష్ట్ర స్ధాయిలో జూన్‌ 20న జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమాలు 
==> జూన్‌ 28 నుంచి అమ్మ ఒడి 
==> జూన్‌12న జగనన్న విద్యాకానుక అమలు    
==> ప్రభుత్వ స్కూలు పిల్లలకు టోఫెల్‌ ఎగ్జామ్స్‌.. ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఈటీఎస్‌తో ఒప్పందం  
==> రాష్ట్రంలో నాలుగు ఐఆర్‌ బెటాలియన్లు ఏర్పాటులో భాగంగా ప్రతి బెటాలియన్‌కు 980 పోస్టుల చొప్పున మొత్తం 3920 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం. 
==> గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌అమ్మెనియా పాలసీకి మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్
==> అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 300 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టును ఏర్పాటుచేయనున్న రెన్యూ వోయేమాన్‌ పవర్‌ ప్రై.లిమిటెడ్‌.. ఆమోదం తెలపిన రాష్ట్ర మంత్రివర్గం.


Also Read: IND vs AUS Live Updates: ఫైనల్‌ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా.. స్టార్ ప్లేయర్‌కు నో ప్లేస్.. తుది జట్లు ఇవే..!


 


Also Read: Railway recruitment 2023: రైల్వేలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. రూ.1,40 వేల వరకు జీతం.. అర్హత వివరాలు ఇవే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook