AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మధ్య తరగతి ప్రజలకు స్థలాలు
AP Cabinet Decisions:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. సంక్షేమ పథకాలు, టౌన్‌షిప్‌లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాల్ని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
AP Cabinet Decisions:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. సంక్షేమ పథకాలు, టౌన్‌షిప్‌లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాల్ని మంత్రి పేర్ని నాని వెల్లడించారు.
ప్రతియేటా జూలై 8వ తేదీన ఇక నుంచి వైఎస్ఆర్ రైతు దినోత్సవం(Ysr Raithu Dinotsavam) జరపాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. వంద ఇంటిగ్రేటెడ్ ఆక్వాల్యాబ్‌ల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. 640 కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. అదే విధంగా రాష్ట్రంలో 45 కొత్త రైతు బజార్ల ఏర్పాటు, ఆర్బీకేల వద్ద గోడౌన్ల నిర్మాణాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది. 89 కోట్ల వ్యయంతో మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌లను కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు.
ఇక వైఎస్సార్ బీమా పధకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది జూలై 1,3,4 తేదీల్లో జగనన్న కాలనీల్లో (Jagananna Colony)నిర్మాణాలకు శంకుస్థాపన మహోత్సవం ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటి నిర్మాణానికి 1 లక్షా 80 వేల ఆర్ధిక సహాయం అందించనున్నారు. 339 కోట్ల రూపాయల ఖర్చుతో ఒంగోలులో ఆంధ్రకేసరి వర్శిటీ ఏర్పాటు కానుంది. విజయనగరం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల వర్సిటీగా మారనుంది. మధ్య తరగతి ప్రజల కోసం జగనన్న టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా నగరాలు, పట్టణాల్లో స్థలాల్ని సేకరించి లాభాపేక్ష లేకుండా మధ్య తరగతి ప్రజలకు కేటాయించనున్నారు. కాకినాడ్ సెజ్‌లో 2 వేల 180 ఎకరాల్ని తిరిగి రైతులకు ఇవ్వాలని కేబినెట్ (Ap Cabinet)నిర్ణయించింది. 2021-24 ఐటీ పాలసీ(IT Policy)కు ఆమోదం తెలిపింది.
Also read: Kapu Nestham: కాపునేస్తం రెండో విడత పంపిణీకు సిద్ధమౌతున్న ప్రభుత్వం, త్వరలో ఖాతాల్లో 15 వేల రూపాయలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook