Visakha Sri Saradapeetham: శారదా పీఠానికి బిగ్ షాక్.. ఆ అనుమతులు చెల్లవంటూ ఆదేశాలు.. అసలేం జరిగిదంటే..?
Visakha Sri Sarada peetham issue: విశాఖ శారదా పీఠానికి చంద్రబాబు ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం విశాఖ పీఠానికి కేటాయించిన 15 ఏకరాల స్థలంపై కూటమి సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.
Visakha Sri Sarada peetham land controversy: చంద్రబాబు ప్రభుత్వం విశాఖ శారదా పీఠానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. గతంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. ప్రభుత్వానికి చెందిన 15 ఏకరాలు భూమిని కేటాయించింది. అది కూడా దాదాపు.. రూ. 220 కోట్ల భూమిని, కేవలం రూ. 15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి గత ప్రభుత్వం ధారాదత్తం చేసింది. కూటమి సర్కారు అధికారంలోకి రాగానే దీనిపై విచారణ చేపట్టింది. దీనిపై గతంలోనే శారాదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సైతం మాట్లాడారు. ఈ క్రమంలో చంద్రబాబు గత సర్కారు ఇచ్చిన ఆదేశాలు చెల్లవంటూ కూడా తాజాగా, ఆదేశాలు చేశారు.
ఇదిలా ఉండగా.. విశాఖపట్నంలో శారదా పీఠానికి గత ప్రభుత్వ హయాంలో 15 ఎకరాలు కేటాయించారు. ఇది పూర్తిగా అక్రమంగా జరిగిందని అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తిరుమలలో శారదా పీఠం నిర్మాణాలపైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీని చంద్రబాబు సర్కారు ఆదేశించింది. తిరుమలలో శారదా పీఠం నిర్మాణంపై పలు సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుంది.
కేవలం.. నాలుగు అంతస్తులకు అనుమతి ఇస్తే .. ఆరు అంతస్తుల్లో శారదా పీఠం నిర్మాణాలు జరుపుతోందని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తొంది. ఈ ఏడాది జూన్‌లోనూ దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఇది అక్రమ నిర్మాణమంటూ అప్పట్లో ఆందోళన కూడా నిర్వహించారు. అయితే ఈ వ్యవహారంలో కోర్టులో ఉందని అప్పట్లో టీటీడీ తెలిపింది.
మరోవైపు విశాఖలోని శారదా పీఠాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా పలువురు రాజకీయ నాయకులు గతంలో తరచుగా సందర్శిస్తూ ఉంటారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి, వైఎస్ జగన్‌కు మధ్య సాన్నిహిత్యం ఉండేదని కూడా అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది.
Read more: Renu Desai: డిప్యూటీ సీఎంను ఫాలో అవుతున్న రేణు దేశాయ్.. ఇంట్లో గణపతి, చండీ హోమం.. పిక్స్ వైరల్..
ఇక వైసీపీ ప్రభుత్వం హయాంలో స్వరూపానందేంద్ర సరస్వతి భద్రత కోసం 2+2 గన్‌మెన్, ఎస్కార్ట్ వాహనంతో పాటుగా 15 మంది సిబ్బందిని కూడా కేటాయించారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సెక్యూరిటీని కుదించింది. స్వరూపానందేంద్ర సరస్వతి వ్యక్తిగత భద్రత కోసం ఒక్క పోలీసును నియమించింది. తాజాగా, ఈ విధంగా నిర్ణయం తీసుకొవడం మాత్రం మరోసారి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.