ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసర టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. నీరు-ప్రగతి కార్యక్రమం ఎలా జరుగుతుందని ఆరా తీశారు. అలాగే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులకు సంబంధించి కూడా అధికారులను ప్రశ్నలు అడిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పలు చోట్ల పిడుగులు పడి జనాలు మృతి చెందడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని.. అధికారులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారని.. విపత్తులకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు ముందుగానే తెలియజేయాలని అధికారులకు తెలిపారు. అలాగే వ్యవసాయ సీజన్ వచ్చేవరకూ ఉపాధి హామీ పనులు ముమ్మరం చేయాలని తెలిపారు.


అలాగే తాగునీటి పథకాల పనులు కూడా వేగంగా పూర్తిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో పొరపొచ్చాలు ఉన్నా.. తమిళనాడు, కేరళలు మంచి అభివృద్ధి శాతాన్నే నమోదు చేస్తున్నాయని.. అలాగే ఏపీ కూడా అభివృద్ధి దిశగా పయనించి అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలవాలని అన్నారు.