Amaravati land scam: సీఐడీ చేతికి కీలక ఆధారాలు, సుప్రీంకోర్టుకు వెళ్లనున్న ప్రభుత్వం
Amaravati land scam: అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. కుంభకోణంపై విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు దర్యాప్తు పురోగతి సాధించిందని తెలుస్తోంది.
Amaravati land scam: అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. కుంభకోణంపై విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు దర్యాప్తు పురోగతి సాధించిందని తెలుస్తోంది.
రాజధాని ముసుగులో అమరావతిలో భూముల కుంభకోణం (Amaravati land scam) వ్యవహారం సంచలనమవుతోంది. అసైన్డ్ భూముల్ని ఆక్రమించి, రైతుల్నించి బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో సీఐడీ దర్యాప్తు (CID Probe) చేస్తోంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), మాజీ మంత్రి నారాయణ(Narayana)లకు సీఐడీ నోటీసులు జారీ చేయగా.. హైకోర్టు( High court)కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. నాలుగు వారాలపాటు కేసు వాయిదా పడింది. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేసిన సీఐడీ అధికారులు కీలక వివరాలు రాబట్టినట్టు సమాచారం. ఈ కేసులో సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేసిన సీఐడీ అధికారులు ఫిర్యాదుదారైన ఆర్కే, అప్పటి గుంటూరు జాయింట్ కలెక్టర్, సీఆర్డీఏ కమీషనర్‌గా వ్యవహరించిన చెరుకూరి శ్రీధర్‌లను విచారించి కీలక ఆధారాలు సేకరించారు. అసైన్డ్ భూముల కుంభకోణంలో గత ప్రభుత్వ పెద్దలతో పాటు టీడీపీ నేతలు, బినామీలు ఉన్నట్టు సీఐడీ ఆధారాలు సేకరించాయి.
అటు చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలు హైకోర్టు నుంచి తెచ్చుకున్న స్టేను ఎత్తివేసేలా ప్రాథమిక ఆధారాలతో సహా కౌంటర్ దాఖలు చేసేందుకు సీఐడీ కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకూ సేకరించిన పలు ఆధారాల్ని న్యాయస్థానానికి నివేదించనుంది. హైకోర్టు స్టే ఉత్తర్వులు పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు రెండ్రోజుల్నించి న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. అవసరమైతే సుప్రీంకోర్టు(Supreme court)ను ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉంది.
Also read: Coronavirus alert: రాజమండ్రి తిరుమల కళాశాలలో కరోనా వైరస్ , 163 మంది విద్యార్ధులకు పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook