Perni Nani says AP CM Jagan respects Chiranjeevi: తెలుగు చిత్ర పరిశ్రమల నెలకొన్న సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలంటూ మెగాస్టార్‌‌ చిరంజీవి కోరిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవ చూపాలని చిరు కోరారు. ఈ క్రమంలో సోమవారం ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, థియేటర్‌ యజమానులు భేటీ అయ్యారు. ఆన్‌లైన్‌ టికెట్ల వ్యవహారంపై చర్చించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం ఏపీ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి పేర్ని నాని (AP cinematography minister perni nani) మాట్లాడుతూ చిరంజీవి అంటే సీఎం జగన్‌కు గౌరవం ఉందని, మెగాస్టార్‌‌ని ఆయన సోదరభావంతో చూస్తారని అన్నారు. త్వరలోనే ఆన్‌లైన్‌ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతామని మంత్రి పేర్ని చెప్పారు.ప్రజలకు మేలు చేసే విషయాలపై ఎవరు విన్నపం చేసినా తమ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు పేర్ని నాని. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి సినీ ప్రముఖులకు వివరించామని తెలిపారు.


Also Read : IPL Man Of The Match: IPLలో అత్యధిక "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" లు గెలిచింది వీళ్లే..!


ప్రభుత్వ నిర్దేశించిన టికెట్ రేట్లనే (ticket rates) థియేటర్స్ అమలు చేయాలన్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌, థియేటర్‌ యజమానులు పలు విషయాలు తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటన్నింటినీ సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తామన్నారు. అయితే సమావేశంలో బెనిఫిట్‌ షోల (Benefit shows) గురించి ఎవరూ అడగలేదు అని పేర్ని నాని (Perni Nani) తెలిపారు.


Also Read : Amazon Vs China: అమెజాన్ నిర్ణయం చైనా ఆర్ధిక వ్యవస్థను దెబ్బ కొడుతుందా లేదా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook