ఫొని తుపాను నష్టంపై ఏపీ సీఎం చంద్రబాబు వివరణ
ఫొనీ తుపాను తీవ్రత, ఏపీలో జరిగిన నష్టంపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు
ఫొని తుపాను తీవ్రతపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంలో ఆయా జిల్లాల్లో జరిగిన నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నాయి. ఈ సందర్భంగా తుపాను నష్టంపై ఏపీ సీఎం చంద్రబాబు వివరణ ఇచ్చారు.
ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం తుపాను వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో 162 ఇళ్ల పాక్షికంగా దెబ్బతీన్నాయి. ఆస్తినష్టం జరిగినా ప్రాణనష్టం లేకుండా చూశామన్నారు. రాష్ట్రంలో 14 మండలాలు తుపాను బారిన పడ్డాయి. మొత్తం 733 గ్రామాలు తుపాను ప్రభావిత జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు . తాము 9 మండలాల్లో పూర్తి స్థాయిలో సహాయక చర్యల సాగాయని..తుఫాను తీవ్రత కారణంగా మిగిలిన చోట్ల సహయక చర్యలు అనుకున్న స్థాయిలో జరగలేదన్నారు.
కాగా సాధారణ పౌర జీవనం పునరుద్దరించాల్సి ఉంది. తుపాను తీవ్రత తగ్గిన వెంటే రోడ్డు, కరెంట్ స్థంబాలు, టెలీఫోన్ కమ్యూనికేషన్స్ ను పునరుద్దరించాల్సి ఉందని చంద్రబాబు వివరించారు. తుపాన వల్ల జరిగిన నష్టం గురించి ఇంకా వివరాలు అందాల్సి ఉందని..పూర్తి స్థాయిలో రిపోర్టు వచ్చాక కేంద్రం సాయం కోరుతామన్నారు.