ఈవీఎంల పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు... మరోమారు ఎన్నికల సంఘం  తీరును తప్పుబడుతూ విమర్శలు సంధించారు. ఈ రోజు అమరావతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చంద్రబాబు మాట్లాడుతూ.. వీవీప్యాట్‌ లోని స్లిప్పులు లెక్కించమని కోరితే.. ఆరు రోజులు పడుతుందని సుప్రీం కోర్టులో తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారని ఈసీ తీరును చంద్రబాబు తప్పబట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈసీపై ప్రశ్నల వర్షం...
తాము డిమాండ్ చేస్తున్న  50 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించడానికి ఎన్నికల సంఘానికి అభ్యంతరమేంటి ?... అసలు స్లిప్పులు లెక్కించడానికి మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారని ఈసీని ప్రశ్నించారు. ఈవీఎంలలో నమోదువుతున్న ఓట్లకు వీవీప్యాట్‌కు స్లిప్పులకు తేడా ఉంటున్నందునే లెక్కించాలని చెబుతున్నామన్నారు.


ఈ పోరు ఇంతటితో ఆగదు...
ఎన్నికల్లో ఇంత అవకతవకలు తాన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు . అసలు దేశంలో ఎన్నికల సంఘం ఉందా? తప్పులను ఎత్తి చూపితే రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సందేహాలకు సమాధానం చెప్పడం మానేసి ఎదురుదాడి చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. వీవీ ప్యాట్లపై ఇక్కడితో ఆగేది లేదని.. ఇతర రాష్ట్రాలకూ వెళ్లి అందరినీ చైతన్య పరుస్తామని చెప్పారు. దీనిపై మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు చంద్రబాబు వివరించారు.