అమరావతి: ప్రధాని పదవిపై ఏపీ సీఎం చంద్రబాబు మరోమారు స్పందించారు. ప్రధాన మంత్రి కుర్చీ ఎక్కాలన్న ఆశ తనను ఏమాత్రం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.  ఎన్నికల ఫలితాల తర్వాత అందరూ కూర్చుని చర్చించి ప్రధాని అభ్యర్థిని ఎంచుకుంటామని వివరించారు. కొందరు ఎన్నికల ఫలితాల తర్వాత తమ కుటమి గల్లంతు అవుతందని పగటి కలలు కుంటున్నారని..అది ఎప్పటికీ నిజంకాదన్నారు. అలాంటి కలలు కంటున్న వారే గల్లంతు అవుతారని ప్రధాని మోడీని ఉద్దేశించి పరోక్ష చంద్రబాబు చురకలు అంటించారు .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మే 23 తర్వాతే ఏదైనా ..


ఎన్నికల ప్రచారంలో భాంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ, డీఎంకే సహా పలు పార్టీలు కలిసి ఏర్పడ్డ మహాకూటమి మే 23 తర్వాత గల్లంతు అవుతుందన్నారు. చంద్రబాబు ప్రధాని పదవి ఆశిస్తున్నారనే అర్థం వచ్చేలా  మోడీ వ్యాఖ్యానినంచారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు ఈ మేరకు ఖండించారు


ప్రధాని పదవిని మోడీ దిగజార్చారు
నరేంద్ర మోడీ ప్రధాని స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించడం లేదని చంద్రబాబు విమర్శించారు. ఏ ప్రధాన మంత్రి సాహసించని రీతిలో ఈసీ పూర్తిగా మోదీ కనుసన్నల్లో పనిచేస్తుందని చంద్రబాబు ఆరోపించారు. నెహ్రూ, వాజ్ పేయి, మన్మోహన్ సింగ్ ప్రధాని పదవికి వన్నె తీసుకొస్తే.. మోడీ  దాని స్థాయిని దిగజార్చేశరని ఈ సందర్భంగా చంద్రబాబు విరమ్శించారు