నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమి కార్యక్రమంలో పాల్లొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు... పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.ఈ సందరర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తూ తనపై నమ్మకంతోనే ప్రజలు వేల ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించారని..ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం ఏపాటిదో దీంతో అర్థమౌతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మిస్తామని.. కేంద్ర సహకారం లేకున్నా.. ఇప్పటికే అమరావతిలో బ్రహాండమైన భవనాలు కడుతున్నామన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రజా రాజధాని కావాలని..అందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో రాజధానిలో స్థిరపడాలనుకునే వారి కోసం  5 వేల ఎకరాలను రిజర్వే చేస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.


అన్నదాతలు ముందుకు రండి...
దేశంలోని ఎక్కడా లేని విధంగా అన్నా క్యాంటిన్లు ఏర్పాటు చేసి రూ.5 కే మంచి భోజనం అందిస్తున్నామన్నారు.  ఛారిటీ ద్వారా నిధులు సేకరించి అన్నా క్యాంటిన్లు నడుపుతన్నామన్నారు... అన్నదానం చేయాలనుకునే వారు అన్నా క్యాటింన్లను ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేస్తున్నామని.. ఈ ఏడాది 10 లక్షల ఇళ్ల పూర్తి చేస్తామన్నారు. భవిష్యత్తు మరిన్ని ఇళ్ల నిర్మించి రాష్ట్రంలోని ప్రతి పేదవారికి సొంతిటి కల నిజం చేస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.