రైల్వే జోన్ కోసం సమరం షురూ; తక్షణమే ప్రకటించాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ
రైల్వే జోన్ అంశంపై మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.విశాఖలో వెంటనే రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ను కోరారు. విభజన చట్టాన్ని అనుసరించి రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
విజయవాడ, గుంటూరు, వాల్తేర్, గుంతకల్ డివిజన్లతో కలుపుకొని విశాఖ జోన్ ఏర్పాటు చేయాలని లేఖలో వివరించారు. రైల్వేజోన్ ఏర్పాటుకు నిపుణుల కమిటీ నివేదిక సిద్ధం చేసిందని గుర్తు చేస్తూ.. విశాఖ జోన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
విభజన హామీలను నెరవేర్చలేదని కారణం చూపుతూ ఇటీవలె ఎన్టీయే నుంచి టీడీపీ బయటికి వచ్చిన విషయం తెలిసిందే.. అనంతరం విభజన హామీల అమలుపై కేంద్రంపై సమరశంఖం పూరించిన చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంపై కేంద్రాన్ని పార్లమెంట్ ఉభయసభలతో పాటు ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గట్టిగా నిలదీస్తున్నారు..రైల్వే జోన్ అంశంపై కూడా ఇదే స్థాయిలో నిలదీయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో కేంద్రానికి లేఖ రాశారు.
రైల్వే జోన్ విషయంలో కేంద్రం ఇప్పటికైనా స్పందిస్తే సరి... లేకుంటే ఉద్యమ బాట పట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి సమాచారం. ఎన్నికల సమయంలో ఇది పార్టీకి మైలేజీ ఇస్తున్నదన్న అభిప్రాయంతో టీడీపీ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.