CM Jagan: అంగన్‌వాడీల నుంచే నాణ్యమైన విద్య..అధికారులకు సీఎం జగన్ ఆదేశం..!
CM Jagan: మహిళా-శిశు సంక్షేమ శాఖపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడీల నిర్వహణ, పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం, దివ్యాంగుల సంక్షేమం వంటి అంశాలపై ఆరా తీశారు.
CM Jagan: స్కూళ్లల్లో టాయిలెట్ల మెయింటెనెన్స్ కోసం ఎలాంటి విధానాలు అవలంభిస్తున్నారో..అంగన్‌వాడీల నిర్వహణ అదే పద్ధతి ఉపయోగించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఎస్ఎంఎఫ్ తరహాలో అంగన్ వాడీల నిర్వహణ, పరిశుభ్రత కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలన్నారు. అంగన్‌వాడీలకు కూడా ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టాయిలెట్ల మరమ్మతు పనులు చేపట్టాలన్నారు.
అంగన్ వాడీ పిల్లలకు ఇప్పటి నుంచే భాష, ఉచ్ఛారణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. పాఠశాల విద్యా శాఖతో కలిసి కగడ్బందీగా పీపీ-1, పీపీ-2 పిల్లలకు పాఠ్య ప్రణాళికలు అమలు చేయాలన్నారు. అన్ని బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ ఉండాలని ఆదేశించారు సీఎం జగన్. అంగన్ వాడీలకు అత్యంత నాణ్యమైన పౌష్టికాహారం పంపిణీ చేయాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కొనుగోలు, పంపిణీ విధానాలపై సమగ్రంగా సమీక్షించారు. పిల్లలకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమన్నారు.
నాణ్యతను పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతనే పిల్లలకు చేరాలన్నారు సీఎం జగన్. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోళ్లు, పంపిణీని పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. బాల్య వివాహాలను పూర్తిగా నివారించాలన్నారు. కళ్యాణమస్తు పథకంలో భాగంగా వధువు, ఆమెను వివాహం చేసుకునే వరుడు తప్పనిసరిగా టెన్త్ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన పెట్టామని స్పష్టం చేశారు. ఎస్‌డీజీ లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం.
అంగన్ వాడీల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక నెంబర్‌తో ఉన్న పోస్టర్‌ను ప్రతి అంగన్‌వాడీలో ఉంచాలని ఆదేశించారు. పోస్టర్లు కచ్చితంగా ఉంచే బాధ్యతలను అంగన్ వాడీలకు అప్పగించాలని సీఎం జగన్ ఆదేశించారు. సెప్టెంబర్ 30 కల్లా అంగన్ వాడీ సూపర్ వైజర్ల పోస్టుల భర్తీ చేస్తామని వెల్లడించారు. అత్యంత పారదర్శకంగా పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తున్నామని ఈసందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు.
ఇంటర్వ్యూ ముగిశాక మర్కుల జాబితాలను వెల్లడిస్తామన్నారు. పరీక్షల ప్రక్రియ పూర్తి చేసి సెప్టెంబర్ 30 కల్లా సూపర్ వైజర్లను నియమించేలా చర్యలు తీసుకుంటామని సీఎంకు తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఓ భవిత సెంటర్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశించారు. దివ్యాంగులకు అవసరమైన సేవలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జువైనల్ హోమ్స్ పర్యవేక్షణకు ప్రత్యేక ఐఏఎస్ అధికారిని నియమించాలన్నారు.
జువైనల్ హోమ్స్‌లో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు సీఎం జగన్. సమీక్షా సమావేశంలో మంత్రి ఉషా శ్రీ చరణ్, స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ, మార్క్‌ఫెడ్ కమిషనర్ పీఎస్. ప్రద్యుమన్న, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ సిరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also read:IND vs AUS: సూపర్ ఫామ్‌లో విరాట్ కోహ్లీ..తన ఖాతాలోకి సరికొత్త రికార్డు..!
Also read:Jagga Reddy: జగన్, షర్మిల బీజేపీ వదిలిన బాణాలే..ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook