CM Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. ఆరోగ్య శ్రీలో మరో 809 చికిత్సలను కొత్తగా చేరుస్తున్నట్లు ప్రకటిచారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులతో ఆరోగ్యశ్రీ పథకం అమలు తీరుపై చర్చించారు. ప్రజలకు అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. పథకం అమలులో ఎక్కడా రాజీపడవద్దని.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా  డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ 2.0ను సీఎం ప్రారంభించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 2,446 చికిత్సలు అందిస్తుండగా.. మరో 809 చికిత్సలను చేరుస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. హస్పిటల్స్‌కు ఎలాంటి బకాయిలు లేకుండా చూస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఏపీలో రోడ్డు ప్రమాదాలకు గురైతే.. గాయపడిన వారికి ఆరోగ్యశ్రీ కింద వెంటనే వైద్య సేవలు అందించాలని సూచించారు. 


ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరును సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. 104 కాల్‌ సెంటర్‌ ద్వారా ఆరోగ్యశ్రీ రిఫరల్‌ సర్వీసులు అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య శ్రీ కింద అందిస్తున్న సేవలపై ఎంపానల్డ్, విలేజ్‌ క్లినిక్స్‌, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోర్డులు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా పూర్తి సమాచారంతో కూడిన బుక్‌లెట్ కూడా అందజేస్తున్నామని తెలిపారు. 


వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. ఆరోగ్యశ్రీ అమలుతీరును తెలుసుకుంటున్నారు. 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకం కింద 1,059 చికిత్సలు ఉండగా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 
చికిత్సల సంఖ్యను 2059కి పెంచారు. రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. 


అదే ఏడాది జూలైలో 2,200 చికిత్సలకు పెంచుతూ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు క్యాన్సర్‌కు సంబంధించి 54 క్యాన్సర్‌ చికిత్సల ప్రక్రియలను ఆరోగ్యశ్రీలో చేర్చారు. అదే ఏడాది నవంబర్‌లో బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి పలు పెద్ద చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ.. చికిత్స సంఖ్యను 2,436కు పెంచారు. ఆ తరువాత కోవిడ్‌కు సంబంధించిన చికిత్సలను కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి ఉచితంగా వైద్యసేవలు అందించారు. తాజాగా మరో 809 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 3255 చికిత్సలకు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు అందనున్నాయి.


Also Read: AP Rains: ఏపీకి అలర్ట్.. మరో మూడు రోజులు భారీ వర్షాలు   


Also Read: Swara Bhaskar Trolls : నీకు ఇంతకంటే పెద్దది కావాలా?.. నెటిజన్ ట్వీట్ మీద స్వర భాస్కర్ కౌంటర్ వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook