YSR Law Nestham Scheme: ఏపీలో వారికి గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి
CM Jagan Mohan Reddy Released YSR Law Nestham Funds: ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ లాయర్లకు తీపికబురు. ఇక నుంచి వైఎస్ఆర్ లా పథకం కింద ఏడాదికి రెండుసార్లు లబ్ధిపొందనున్నారు. నేడు లాయర్ల ఖాతాలో నగదు జమ చేసిన సీఎం జగన్.. పథకంలో మార్పుల గురించి వివరించారు.
CM Jagan Mohan Reddy Released YSR Law Nestham Funds: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో గుడ్‌న్యూస్ చెప్పారు. వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని ఇకపై ఏడాదికి రెండుసార్లు అమలు చేస్తామని వెల్లడించారు. లాయర్లకు ప్రభుత్వం తోడుగా ఉందని తెలిపేందుకే వైఎస్‌ఆర్ లా నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. లా డిగ్రీ అందుకున్న విద్యార్థులు న్యాయవాదిగా స్థిరపడేందుకు లా నేస్తం కచ్చితంగా ఉపయోగపడుతుందన్నారు. గత మూడేళ్లుగా లా నేస్తం నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. మూడున్నరేళ్లలో 4,248 మంది లాయర్లకు లా నేస్తం అందించామని వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం వైఎస్‌ఆర్ లా నేస్తం పథకం ద్వారా నిధులను ముఖ్యమంత్రి రిలీజ్ చేశారు. జూనియర్ న్యాయవాదుల ఖాతాల్లో రూ.కోటి 55 వేలు ఆయన జమ చేశారు.
మొదటి మూడేళ్లు న్యాయ వృత్తిని ఎంచుకున్న ఉన్న వారు ఎలంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సాయం చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రతి జూనియర్ న్యాయవాదికి మూడేళ్లపాటు నెలకు రూ.5 వేల చొప్పున సాయం అందజేస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా గత మూడున్నరేళ్లలో 4,248 మంది లాయర్లు లబ్ధిపొందారని పేర్కొన్నారు. ఈ పథకం కోసం ఇప్పటివరకు రూ.35.45 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం ఈ పథకంలో 2,011 మంది జూనియర్ న్యాయవాదులు అర్హులుగా కొనసాగుతున్నారని.. నేడు కోటి రూపాయలపైనే వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని వెల్లడించారు సీఎం జగన్. న్యాయవాదులపై ప్రభుత్వం ఇంకా దృష్టిసారిస్తుందని.. ఈ పథకంలో కొంచెం మార్పులు తీసుకువచ్చి ఏడాదికి రెండుసార్లు ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి లా నేస్తం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అదేవిధంగా లాయర్ల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశామన్నారు. కరోనా సమయంలో కూడా ఈ కార్పస్ ఫండ్ నుంచి రూ.25 లక్షలతో న్యాయవాదులకు మంచి చేశామని గుర్తుచేశారు.
'వైఎస్ఆర్ కాపు లా నేస్తం పథకం కింద ఏ ఒక్క జూనియర్ లాయర్ మిస్ అవ్వకూడదు. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకే ఏడాదికి రెండుసార్లు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా జూనియర్ న్యాయవాదులకు మంచి జరగాలి. మీ వృత్తిలో మంచిగా రాణించాలి..' అని సీఎం జగన్ ఆకాంక్షించారు.
Also Read: YS Sharmila: తెలంగాణలో హిజ్రాలు ఆందోళన.. వైఎస్ షర్మిల క్షమాపణలు
Also Read: Deepak Chahar: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్‌కు దీపక్ చాహర్ రెడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి