AP CABINET: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో మళ్లీ మార్పులు జరగనున్నాయా? పని తీరు సరిగా లేని మంత్రులను సాగనుంపనున్నారా? అంటే మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ చేసిన కామెంట్లతో అవుననే తెలుస్తోంది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక కామెంట్లు చేశారు సీఎం జగన్. కొందరు మంత్రుల పనితీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ప్రభుత్వంపై విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలకు ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదని జగన్ నేరుగానే నిలదీశారని చెబుతున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత అధికారులను బయటికి పంపించిన జగన్.. మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొందరు మంత్రులపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తన కుటుంబసభ్యులపై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేస్తుంటే ఎందుకు తిరిగి ప్రశ్నించడం లేదని మంత్రులను సూటిగా జగన్ ప్రశ్నించినట్టు చెబుతున్నారు. రెండు నెలల సమయం ఇస్తున్నానని.. అయినా మారకపోతే ఇంటికి వెళ్లి కూర్చోవాలని హెచ్చరించారట. కేబినెట్ లో మార్పులు చేస్తానని సీఎం జగన్ స్పష్టం చేశారట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేబినెట్ సమావేశంలో జగన్ చేసిన కేబినెట్ లో మంత్రులను షాక్ కు గురి చేశాయని అంటున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు జగన్. నిజానికి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసినప్పుడే రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని పూర్తిగా మార్చివేస్తానని చెప్పారు. కాని కొందరు సీనియర్లు సహా ఏడుగురిని కొనసాగిస్తూ కొత్త వారిని  తీసుకున్నారు. ఇదే వచ్చే ఎన్నికలకు జగన్ టీమ్ అని అంతా భావించారు. కాని అనూహ్యంగా మరోసారి మంత్రివర్గంలో మార్పులు చేస్తానని జగన్ చెప్పడంతో.. వేటు పడేది ఎవరిపై అన్న చర్చ సాగుతోంది. జగన్ తొలగించబోయే మంత్రులు వీళ్లేనంటూ పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మంత్రుల పనితీరుపై ఎప్పటికప్పుడు నిఘా వర్గాల నుంచి జగన్ సమాచారం తెప్పించుకుంటున్నారని అంటున్నారు. ఆ నినేదిక ప్రకారమే మంత్రులకు జగన్ క్లాస్ పీకారని చెబుతున్నారు. 


వైసీపీ వర్గాల సమాచారం ప్రకారం మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాద్. జోగు రమేశ్, సిదిరి అప్పలరాజు, చెన్నుబోయిన వేణుగోపాల కృష్ణ, మేరుగు నాగార్జున, విడదల రజనీ వంటి వారి విషయంలో జగన్ సంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడంతో పాటు విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడంలో ఈ నేతలు యాక్టివ్ గా ఉన్నారని జగన్ సర్వేలో తేలిందట. కేబినెట్  పునర్ వ్యవస్థీకరణ తర్వాత ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడంలో కొత్త మంత్రులు, పాత మంత్రులు విఫలం అవుతున్నట్టు జగన్ గ్రహించారని అంటున్నారు. ఆదిమూలపు సురేష్ విషయంలో జగన్ సీరియస్ అయ్యారని అంటున్నారు. ఫలానా అంశంపై మాట్లాడాలని సీఎం కార్యాలయం నుంచి సందేశం వచ్చిన సురేష్ లైట్ తీసుకున్నారనే నివేదికలు జగన్ కు వచ్చాయట. కొన్ని సార్లు తాను జాతీయ మీడియాతోనే మాట్లాడుతానని సురేష్ చెప్పారట. ఈ విషయాన్ని మంత్రుల ముందే జగన్ చెప్పి.. సురేష్ ను మందలించారని  అంటున్నారు. 


పోలవరం విషయంలో లోకేష్  విమర్శలను మంత్రి అంబటి రాంబాబు సరిగా కౌంటర్ చేయలేకపోతున్నారని జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. కొందరు మహిళా మంత్రులు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉందని జగన్ అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ఎంపీ మాధవ్ విషయంలో హోంశాఖ మంత్రి సరిగా వర్క్ చేయకుండానే మీడియాతో మాట్లాడటంతో ఇబ్బందులు వచ్చాయని జగన్ చెప్పారని తెలుస్తోంది. కోనసీమ అల్లర్ల సమయంలో గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు సరిగా స్పందించలేదని జగన్ అన్నారని తెలుస్తోంది. రాయలసీమకు చెందిన మంత్రులు పార్టీ వ్యవహారాల కంటే వ్యాపారాలపైనే ఫోకస్ ఎక్కువు చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. దీంతో ఐదారుగురు మంత్రులకు జగన్ ఉద్వాసన పలకవచ్చనే చర్చ వైసీపీ వర్గాల్లోనే సాగుతోంది. 


Also Read: Chiranjeevi - Pawan Kalyan: ఒకే స్టేజ్‌పై చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌.. అభిమానులకు పండగే ఇగ!


Also Read: Rashmika Mandanna Pics: రష్మిక మందన్న హాట్ అలెర్ట్.. క్లీవేజ్ అందాలతో మతిపోగోడుతుందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి