దేశ రాజధాని ఢిల్లీ వేదికగా త్వరలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఏపీలో అధికార పార్టీ నేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీలో డిసెంబర్ 5వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే జీ20 సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానం అందింది. ఇందులో భాగంగా టీడీపీ, వైసీపీ అధినేతలైన చంద్రబాబు, వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఈ ఇద్దరినీ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో ఈ ఇద్దరు బద్ధ శత్రువులు ఒకే వేదిక పంచుకోబోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఈ ఇద్దరి మధ్య ఉన్న వైరం రాజకీయమైంది కాదు. రాజకీయాలు దాటి..వ్యక్తిగత వైరంగా మారిపోయింది. 


ఈ పరిస్థితుల్లో ఇద్దరూ కలిసి ప్రధాని మోదీ సమక్షంలో ఒకే వేదిక పంచుకోనుండటం ఆసక్తి రేపుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు డిసెంబర్ 5న ఈ ఇద్దరూ వెళ్లడం ఖరారైంది. ఇద్దరూ ఒకే కారణంతో ఒకే వేదిక కోసం వెళ్తున్నారు. ఇద్దరు నేతలు ఎదురెదురు పడితే..పలకరింపులు ఉంటాయా లేదా అనేది చూడాలి. ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.


Also read: AP High Court: ఏపీ హైకోర్టు న్యాయముర్తి బదిలీ ఎందుకు చర్చనీయాంశమౌతోంది, అసలేమైంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook