AP CM Ys Jagan Cryptic Comments on Pawan Kalyan: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో రూ.986 కోట్ల ప్రాజెక్టులకు ఏపీ సీఎం జగన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో   నర్సీపట్నం రూపురేఖలు మార్చబోతున్నామని పేర్కొన్న ఆయన ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకుంటామని అన్నారు. ఇక ఈ క్రమంలో నర్సీపట్నం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పెన్షన్లు తగ్గిస్తున్నారు అంటూ జరుగుతున్న ప్రచారం మీద వివరణ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్ లో భాగంగా నిబంధనల ప్రకారం వెరిఫికేషన్ నోటీసులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని అలా ఇప్పుడు కేవలం నోటీసులు ఇచ్చినందుకు ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. ఇక చంద్రబాబు ప్రభుత్వం 39 లక్షల మందికి పెన్షన్ ఇస్తే మేం 62 లక్షల మందికి పెంచామని అలాగే జనవరి 1 నుంచి సామాజిక పెన్షన్లు 2750 రూపాయలు ఇవ్వబోతున్నామని అన్నారు.


ఇక ఇదే సభలో పవన్ కళ్యాణ్ పై సీఎం సెటైర్లు వేశారు. ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం, ఈ ప్రజలు కాకపోతే, ఆ ప్రజలు, ఈ పార్టీ కాక పోతే ఆ పార్టీ.. ఈ భార్య కాకపోతే ఆ భార్య అన్నట్టుగా ఈ స్టైల్ ఉందని విమర్శలు చేశారు. ఈ రాష్ట్రానికి ఇదేం ఖర్మ రా - చంద్రబాబు ఖర్మ పట్టిందా అని అడుగుతున్నానని అన్నారు. ఇక రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్లా  ఓడిపోయిన నేత అతనికి దత్త పుత్రుడని అన్నారు.


చంద్రబాబు ఏ స్క్రిప్ట్ ఇచ్చి, ఎక్కడ మాట్లాడమని చెబితే అక్కడ మాట్లాడే వాడు దత్త పుత్రుడు అని పరోక్షంగా పేర్కొన్న జగన్ చంద్రబాబు మోసాల్లో పాపంలో వాటా ఉన్న దత్త పుత్రుడు సభలకు జనం వస్తారా? అని ప్రశ్నించిన జగన్ పీవీ సింధు బ్యాడ్మింటన్ గెలిస్తే నేనే నేర్పించా అనడం చంద్రబాబు స్టైల్ అని జగన్ ఎద్దేవా చేశారు. ఇక బాబును చూస్తే వెన్నుపోటు, మోసాలు తప్ప వేరే పథకాలు ఏమీ గుర్తు లేవని పేర్కొన్న జగన్ చంద్రబాబు సభలకు పెద్ద యెత్తున జనం వస్తున్నట్టు సృష్టిస్తున్నారని, అసలు అందరినీ వంచించిన బాబు సభలకు జనం ఎందుకు వస్తారు? అని ప్రశ్నించారు.


రుణ మాఫీ చేస్తానని మోసం చేసినందుకు రైతులు, డ్వాక్రా మహిళలు థాంక్స్ చెప్పడానికి వస్తారా అని అడుగుతున్నానని సీఎం జగన్ ప్రశ్నించారు. ఇక హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు కు థాంక్స్ చెప్పడానికి బీసీ లు, మైనారిటీ లు, విద్యార్థులు, నిరుద్యోగులు వస్తారా అని అడుగుతున్నానని ప్రశ్నించిన జగన్ అదే మంచి చేసే ఉంటే బాబు కొడుకు, దత్త పుత్రులను ఎందుకు ఓడిస్తారని అడుగుతున్నానని అన్నారు. డ్రోన్ షూటింగ్ కోసం చిన్న గొందిలోకి తీసుకెళ్ళి 8 మంది చంపేశారని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా షూటింగ్ కోసం గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపేశారని విమర్శించారు.


మీరు గర్వంగా చెప్పుకునే విధంగా మీ జగనన్న నాయకత్వం ఉంటుందని పేర్కొన్న ఆయన  రాజకీయం అంటే షూటింగ్ లు కాదు, డైలాగులు కాదు, డ్రామాలు అంతకన్నా కాదని అన్నారు. రాజకీయం అంటే ఒక నిరుపేద కుటుంబంలో ఎలాంటి మంచి మార్పులు తీసుకుని రాగలిగామన్నదే అని అన్నారు. రాజకీయం అంటే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడం, రైతులను చేయిపట్టి నడిపించడం, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం, అవినీతి లేకుండా పథకాలు ఇవ్వడం, అన్ని ప్రాంతాల అభివృద్ధి అని అంటూ జగన్ తనదైన డెఫినిషన్ చెప్పారు. 


Also Read: Dil Raju Shock: 'మైత్రీ'కి మరో షాకిచ్చిన దిల్ రాజు.. త్యాగమూర్తిని కాదంటూ కామెంట్స్!


Also Read: Urvashi Rautela Praying: ఊర్వశి రౌతేలా ప్రార్ధనలు రిషబ్ పంత్ కోసమేనా.. లేక?



 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook