Police Jobs: ఏపీలో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీ, సీఎం జగన్ దీపావళి కానుక
Police Jobs: నిరుద్యోగ యువతకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీపావళి కానుక ఇచ్చారు. భారీ ఎత్తున పోలీసు ఉద్యోగాల భర్తీకు పచ్చజెండా ఊపడంతో..వేలాది నిరుద్యోగులకు ఊరట కలిగింది.
దీపావళి రాకముందే ఏపీ ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు బహుమానం అందేసింది. త్వరలో భారీగా పోలీసు ఉద్యోగాల్ని భర్తీ చేసేందుకు ప్రక్రియ ప్రారంభమైంది. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వెలువరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుమతిచ్చారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీపి కబురు అందించారు. రాష్ట్రంలో 6, 511 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే నియామక ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల కోసం వేలాదిమంది చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన జీవో ఎంఎస్ నెంబర్ 153 విడుదలైంది. త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వెలువరించేందుకు ఏపీ డీజీపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. రాష్ట్రంలోని పోలీసు శాఖలో రిటైర్‌మెంట్స్, పదోన్నతులు, మరణాలతో పాటు ఇటీవల ఏపీ ప్రభుత్వం పోలీసు శాఖకు వీక్ ఆఫ్ ఇస్తుండటంతో సిబ్బంది తక్షణ అవసరం ఏర్పడింది. త్వరలో వెలువడనున్న నోటిఫికేషన్ ప్రకారం సివిల్ విభాగంలో మొత్తం 315 ఎస్ఐ పోస్టులు, 3580 కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఆర్ఎస్ఐ పోస్టులు 96, ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు 2520తో కలిసి మొత్తం 6511 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook