Coronavirus tests in AP: అమరావతి: కరోనావైరస్ మహమ్మారి ( Coronavirus pandemic ) సంక్రమణ ప్రారంభమైనప్పటి నుంచీ తనదైన విధానాలతో ముందుకు దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కరోనావైరస్ నియంత్రణలో మరో రికార్డు సాధించింది. గత 24 గంటల్లో 36 వేల పరీక్షలు నిర్వహించి అత్యధిక కోవిడ్-19 పరీక్షలు చేసిన రాష్ట్రంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ( YS Jagan`s govt ) నెలకొల్పిన సరికొత్త రికార్డుగా వైసిపి నేతలు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనావైరస్ నిర్ధారణ పరీక్షల్లో ( COVID-19 tests ) ఏపీ ప్రభుత్వం మరో రికార్డు నెలకొల్పింది. ఇప్పటికే కోవిడ్-19 నిర్ధారణ పరీక్షల్లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న ఏపీ.. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 36 వేల 47 పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఖ్యాతి దక్కించుకుంది. ఇందులో 448 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 9 వేలకు చేరువలో ఉంది. కాగా 4 వేల 779 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 7 లక్షల 50 వేల 234 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో కరోనావైరస్ కారణంగా ఇప్పటివరకు 129 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో పాజిటివ్ కేసుల శాతం 6.20 ఉండగా... రాష్ట్రంలో 1.38 శాతం మాత్రమే ఉంది. ఏపీలో ప్రతీ 10 లక్షల మందికి 14 వేల 49 మందికి కరోనావైరస్ పరీక్షలు జరిగాయి. ఇక రికవరీ రేటు కూడా రాష్ట్రంలో 46.26 గా నమోదైంది. 


వచ్చే మూడు నెలల కాలంలో ప్రతీ ఇంటికీ కరోనా నిర్ధారణ పరీక్షలు జరపాలన్న ప్రభుత్వ లక్షం దిశగా ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇది పూర్తయితే రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య మరింత గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి.