CM Jagan: పశువులన్నింటికీ బీమా సదుపాయం..సీఎం జగన్ సరికొత్త నిర్ణయం..!
CM Jagan: పశు సంవర్ధక శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పశువుల ఆస్పత్రుల్లో నాడు-నేడు, పశువులకు బీమా, ఫ్యామిలీ డాక్టర్ తరహాలో పశువులకు వైద్య సేవలు వంటి అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
CM Jagan: స్వచ్ఛమైన పాల ఉత్పత్తి కోసం అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు సీఎం వైఎస్ జగన్. ఫెస్టిసైడ్స్, రసాయనాలు ఎక్కువగా వాడుతున్నందున అవి జంతువులకు ఆహారంగా మారి తద్వారా పాలల్లో వాటి అవశేషాలకు దారి తీస్తున్నాయన్నారు. దీనిపై రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. అమూల్ ద్వారా రైతులకు మంచి అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టాలన్నారు సీఎం జగన్. తక్కువ పెట్టుబడి, సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా స్వచ్ఛమైన పాల ఉత్పత్తి సాధించే అంశంపై పరిశోధనలు చేయాలని తెలిపారు.
పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ఆర్బీకేలో ఈపోస్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆడిట్ చేసి అక్టోబర్‌లో పథకం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదవశత్తూ రోగాల వల్ల పశువులు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు వస్తాయని..అలాంటి సమయంలో వారికి అండగా ఉండేందుకే ఈపథకమని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ప్రభుత్వమే 80 శాతం ప్రీమియాన్ని చెల్లిస్తుందన్నారు. పశువులకు పౌష్టికాహారం అందించే విషయంలో కూడా రైతులకు తగిన అవగాహన కల్పించాలన్నారు. సాయిల్ డాక్టర్ మాదిరిగా కేటిల్ డాక్టర్ కాన్సెప్ట్ కూడా అమలు చేయాలన్నారు సీఎం జగన్. వెటర్నరీ ఆస్పత్రుల్లో నాడు-నేడు కింద పనులు చేపట్టాలని ఆదేశించారు. ఆ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలన్నారు. మండలాన్ని ఓ యూనిట్‌గా తీసుకుని ప్రతి చోట వెటర్నరీ వైద్య సదుపాయాలు ఉండేలా సమగ్ర ప్రణాళిక అమలు చేయాలన్నారు.
సెకండ్ ఫేజ్ కింద అక్టోబర్‌లో మరిన్ని పశు అంబులెన్స్‌లు ప్రారంభిస్తామని తెలిపారు సీఎం జగన్. ఆర్బీకేల ద్వారా పశువులకు ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ తరహాలోనే గ్రామాల్లోని పశువులకు వైద్య సేవలు అందాలని ఆదేశించారు. రైతులకు ప్రత్యామ్నాయం ఆదాయాలు పశుపోషణ ద్వారా వచ్చేలా చూడాలన్నారు. పశుపోషణ విషయంలో వారికి అండగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఆర్బీకేలు, కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో పశుపోషణకు సంబంధించిన పరికరాలను అందుబాటులో ఉంచాలన్నారు సీఎం జగన్. జంతువుల్లో లంపీ వైరస్ వ్యాపిస్తోందని..దీనిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. వైరస్..జంతువులకు వ్యాపించకుండా మందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సరిపడా మందులు, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. సమీక్షా సమావేశంలో మంత్రి అప్పలరాజు, అగ్రిమిషన్ వైఎస్ ఛైర్మన్ నాగిరెడ్డితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
Also read:SBI Jobs: బ్యాంక్ అభ్యర్థులకు అలర్ట్..వెంటనే ఎస్‌బీఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి