Ys Jagan Review: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ హై అలర్ట్ ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. అసనీ తుపాను సహాయక చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసనీ  ఇవాళ తీరాన్ని తాకనుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ క్రమంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలపై అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఇప్పటికే 9 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎప్ బృందాలు పంపించారు. అసనీ తుపాను నేపధ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్ జగన్ కోరారు. ఇప్పటికే ప్రభుత్వం ఆయా జిల్లా యంత్రాంగాలకు నిధులు సమకూర్చింది. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో హై అలర్ట్‌గా ఉండాలని సూచించారు. 


తుపాను బలహీనపడటం ఊరట కల్గించే అంశమైనా..కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున నిర్లక్ష్యంగా ఉండవద్దని కోరారు. ప్రజలకు ఏ విధమైన ముప్పు కలగకుండా చూడాలన్నారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. తుపాను బాధితుల పట్ల మానవతా దృక్పధంతో వ్యవహరించారని జాగ్రత్తలు చెప్రారు. పరిహారం ఇచ్చే విషయంలో ఏ విధమైన సంకోచాలు పెట్టుకోవద్దన్నారు. హెల్ప్ డెస్క్ నెంబర్లకు ప్రచారం కల్పించాలన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలపై అసని తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ నేపధ్యంలో తీరప్రాంతాల్లో అప్రమత్తత అవసరమన్నారు. 


Also read: Cyclone Asani Live Updates: అసని తుపాన్ లేటెస్ట్ అప్‌డేట్స్... ఇప్పటివరకూ ఐదుసార్లు దిశ మార్చుకున్న తుఫాన్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook