Ys Jagan Coments: ఏపీ మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ వెనక్కి తగ్గలేదు. ఇంకా అదే ఆలోచన కొనసాగిస్తున్నాయి. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖలోనే ఉంటానని స్పష్టం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖపట్నం అని వ్యాఖ్యానించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా నౌపాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నౌపాడలో గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్వాసితుల కోసం తలపెట్టిన ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎచ్చెర్ల మండలంలో నిర్మించతలపెట్టిన ఫిషింగ్ హార్బర్, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు-హీర మండలం ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్, అంబటి రాంబాబు, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా విశాఖ రాజధాని అంశంపై మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖలోనే బస చేస్తానని స్పష్టం చేశారు వైఎస్ జగన్. సెప్టెంబర్ నెల నుంచి విశాఖలోనే ఉండి అక్కడి నుంచే పరిపాలన సాగిస్తానన్నారు. కాపురం కూడా విశాఖలోనే ఉంటానని తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్..అందరికీ ఆమోదయోగ్యమైంది విశాఖ అన్నారు.


ఉద్ధానం, కిడ్నీ సమస్యల పరిష్కారం కోసం 700 కోట్లతో రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేశామని ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను జూన్ లోగా పూర్తి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికై ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలలు, నాలుగు మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్నామన్నారు. మే 3వ తేదీన భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. అదేరోజు అదానీ డేటా సెంటర్ ప్రారంభిస్తున్నామన్నారు. 


Also read: Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం, తండ్రీ కొడుకులు ఒకేసారి విచారణ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook