ఢిల్లీ: నేడు ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఆవశ్యకత, విభజన చట్టంలోని అంశాల గురించి ఆయనకు వివరించినట్టు తెలిపారు. రాష్ట్రం అన్నివిధాల ఇబ్బందుల్లో ఉన్నందున ఆయా సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిందిగా కోరినట్టు మీడియాకు వెల్లడించారు. శనివారం జరగబోయే నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలోనూ ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతానని వైఎస్ జగన్ తేల్చిచెప్పారు. 


ముఖ్యమంత్రిగా గెలిచాకా ఓసారి వెళ్లి ప్రధాని మోదీ, అమిత్ షాలను కలిసి వచ్చిన వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సీఎం హోదాలో ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి.