సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ సంక్షేమ పథకాలతో వరుసగా రెండో ఏడాది దూసుకెళ్తోంది.  ఆయా సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరేలా అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న వైఎస్ జగన్ తాజాగా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. దీని ద్వారా మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు రూ.24 వేల పంపిణీ జరుగుతుంది.  ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేటి ఉదయం సీఎం క్యాంపు ఆఫీసులో సీఎం వైఎస్ జగన్ ఆన్‌లైన్ పద్ధతిలో నగదును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ నేతన్న హస్తం పథకం కారణంగా 81,024 మందికి చేనేతన్నలకు లబ్ధి చేకూరనుంది. 2020-21 ఏడాదికి గానూ ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా సర్వే చేయించి, లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసింది.  హాట్ ఫొటోలతో యాంకర్ Varshini రచ్చరచ్చ!


కాగా, ఈ నెల 17న ప్రారంభించాలని ఏపీ సర్కార్ తొలుత భావించింది. అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కారణంగా ఈ నెల 20కి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని వాయిదా వేయడం తెలిసిందే. పెట్టుబడి కోసం చేనేతన్నలు ఇబ్బంది పడకూడదని, వారి ఆత్మ గౌరవం, ఆర్థిక చేయూత కోసం సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ