రాజకీయ కక్షలు ఆరోపణలపై స్పందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఇటీవల వైఎస్ఆర్సీపీ అధికారంలోకొచ్చాక రాజకీయ కక్షలు పెరిగిపోయాయని తరచుగా టీడీపి నేతలు చేస్తోన్న ఆరోపణలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తీవ్రంగా ఖండించారు.
అమరావతి: ఇటీవల వైఎస్ఆర్సీపీ అధికారంలోకొచ్చాక రాజకీయ కక్షలు పెరిగిపోయాయని తరచుగా టీడీపి నేతలు చేస్తోన్న ఆరోపణలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా తీవ్రంగా ఖండించారు. మంగళవారం సీఎం అసెంబ్లీలో మాట్లాడుతూ తమ హయాంలో రాజకీయ కక్షలు ఉండవు కానీ.. అవినీతికి పాల్పడిన వారికి శిక్షలు తప్పవని హెచ్చరించారు. ప్రతిపక్షం సహకరించకపోయినా ఏ మాత్రం వెనక్కి తగ్గేదిలేదని, రాష్ట్ర అభివృద్ధి వైపు తన వంతు కృషి చేస్తూనే ఉంటానని జగన్ స్పష్టం చేశారు.
గత పదేళ్ల కాలంలో రాష్ట్రం సర్వనాశనమైందని, 10 రంగాల్లో రాష్ట్రం నష్టపోయిందని త్వరలో వివరాలు వెల్లడిస్తానని చెబుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.