Vizag tragedy: విశాఖపట్నం: వైజాగ్ హిందుస్థాన్ షిప్ యార్డులో భారీ క్రేన్‌ కుప్పకూలి 10 మంది మృతి చెందిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్ రెడ్డి ( AP CM YS Jagan) స్పందించారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులు, ప్రమాదంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు సరైన సమయంలో వైద్య సహాయం అందించేలా తక్షణమే సహాయ చర్యలు వేగవంతం చేయాలని, బాధితులను ఆదుకునే క్రమంలో వేగంగా స్పందించాలని ఆయన అధికారులకు సూచించారు. Also read: Visakhapatnam tragedy: క్రేన్ కుప్పకూలి 10 మంది మృతి


క్రేన్ ట్రాజెడీ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా విశాఖ జిల్లా కలెక్టర్‌కు, నగర పోలీస్‌ కమిషనర్‌కు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీచేశారు. Also read: Janasena: రాజధాని అంశంపై స్పందించిన పవన్ కల్యాణ్