AP CM YS Jagan's Delhi tour: అమరావతి: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రేపు గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్.. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం అమరావతికి చేరుకుంటారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సహా పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి జగన్ కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగులో ఉన్న సమస్యల పరిష్కారం, నిధుల విడుదలపై చర్చించనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: AP Corona Update: ఏపీలో రికార్డు స్థాయిలో కోవిడ్ పరీక్షలు..2 కోట్లు దాటిన పరీక్షలు, కోటి దాటిన వ్యాక్సినేషన్


ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు (Polavaram project) అవసరమైన నిధులు, రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం రావాల్సి ఉన్న కేటాయింపులు తదితర అంశాలు సైతం సీఎం జగన్ (CM YS Jagan) ప్రస్తావిస్తారని తెలుస్తోంది.


Also read : YSR Bima Scheme: వైఎస్ఆర్ బీమా పథకంలో కీలక మార్పులు, జూలై 1 నుంచి అమలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook