Fathers day 2020: నేడు పితృ దినోత్సవం... ఫాదర్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( AP CM YS Jagan) తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ( YSR) గుర్తు చేసుకున్నారు. తండ్రితో తన అనుబంధాన్ని స్మరించుకునే ప్రయత్నం చేస్తూనే.. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రితో ఉన్న ఓ ఫోటోనూ ఈ సందర్భంగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఫోటోతో పాటు చేసిన పోస్ట్ ఇప్పుడందర్నీ కదిలిస్తోంది. ఆకట్టుకుంటోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్వీట్‌లో జగన్  ఏమన్నారు…
" నాన్నే నా బలం, ఆదర్శం. జీవితంలో ప్రతి కీలక ఘట్టంలో నాన్నే నాకు స్ఫూర్తి. ప్రతీ తండ్రి పిల్లల గెలుపు కోసం ప్రయత్నిస్తాడు. పిల్లలకు ప్రేమను, స్ఫూర్తిని పంచుతారు. కష్టకాలంలో అండగా ఉంటారు. ప్రేమిస్తారు. నాన్నే మనకు తొలి స్నేహితుడు, గురువు, మన హీరో. మన సంతోషాలన్నీ నాన్నతోనే పంచుకుంటాం. ప్రతి తండ్రికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు " అంటూ జగన్ ట్వీట్ చేశారు.



 


వైఎస్ జగన్ జీవితంలో తండ్రి ప్రేరణ కచ్చితంగా అడుగడుగునా ఉంటుందని ఆయన్ని దగ్గర్నించి చూసినవారు చెబుతుంటారు. తండ్రి మరణానంతర పరిస్థితుల్లో జరిగిన ఓదార్పు యాత్రనే జగన్ జీవితాన్ని మలుపు తిప్పింది. కాంగ్రెస్‌ను కాదని పార్టీ పెట్టడానికి దారి తీసింది. అది కూడా తన తండ్రి పేరు వైఎస్సార్ పేరిటే వైఎస్సార్సీపీని ( YSRCP ) స్థాపించడం... ప్రతిపక్షనేతగా జగన్ చేసిన పాదయాత్రకు స్ఫూర్తి, ప్రేరణ కూడా నాటి ప్రతిపక్ష నేతగా వైఎస్ చేసిన పాదయాత్రనే. ఈ సామీప్యతల కారణంగానే ఇప్పుడు ఫాదర్స్ డే సందర్బంగా జగన్ చేసిన ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. తండ్రీ కొడుకుల మధ్యన ఉన్న నాటి బంధాన్ని అందరికీ మరోసారి గుర్తు చేస్తోంది