ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల ప్రీ మేనిఫెస్టోను రిలీజ్  చేశారు. విజయవాడలోని కాంగ్రెస్  పార్టీ కార్యలయంలో సోమవారం ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ 'అభయ హస్తం' పేరుతో  తయరైన ప్రీ మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలను పొందుపర్చారు. ఈ సందర్భంగా రఘవీరారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదాపైనే రాహుల్ గాంధీ తొలి సంతకం చేస్తారని..ఇదే అంశాన్ని ప్రీ మెనిఫెస్టోలో పొందుపర్చామని వెల్లడించారు. వీటితో పాటు ఏపీ ప్రజలకు ఉపయోగపడే అనే అంశాలు తమ ఇందులో పొందుపర్చినట్లు రఘువీరారెడ్డి తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు:


* అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదాపై తొలి సంతకం
* బీసీలకు నష్టం జరగని రీతిలో కాపులను బీసీల్లో చేర్చడం
* మహిళలకు చట్ట సభల్లో రిజర్వేన్ల కల్పన
* రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ' 


ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ .. ఇది ప్రీ మేనిఫెస్టో మాత్రమేనని.. ప్రతి ఇంటి నుంచి విలువైన సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకొని ఫైనల్‌ మేనిఫెస్టోకు రూపొందిస్తామన్నారు. కాగా ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ కు సంబంధించిన పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.


[[{"fid":"174704","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]