AP Congress MP Candidates List: ఏపీ కాంగ్రెస్ అభ్యర్ధుల రెండో జాబితా విడుదల.. లిస్టులో మాజీ కలెక్టర్..
AP Congress MP Candidates List: ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు (Lok Sabha Elections)తో పాటు అసెంబ్లీ (AP Assembly)ఏక కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్... తాజాగా రెండో లిస్ట్‌ను విడుదల చేసింది.
AP Congress MP Candidates List: ఏపీలో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తామయ్యాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్ధులను డిక్లేర్ చేసి రంగంలోకి దిగాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో నాల్గో విడతలో భాగంగా మే 13వ తేదిని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యలో వైయస్‌ఆర్సీ, బీజేపీ, తెలుగు దేశం, జనసన కూటమి తమ అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్ధులతో ఎన్నికల రణ రంగంలో దిగింది. అంతేకాదు అధికారంలో వస్తే ప్రత్యేక హోదా సహా పలు గ్యారంటీలను అమలు చేస్తామంటూ మేనిఫ్యేస్టోను విడుదల చేసింది. ఇప్పటికే ఏపీలో ఐదు లోక్‌సభతో పాటు 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్ హై కమాండ్.. తాజాగా ఆరు లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనలైజ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ లిస్ట్‌ను విడుదల చేశారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లో 11 లోక్‌సబ, 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారు.
లోక్‌సభకు ప్రకటించిన అభ్యర్ధుల విషయానికొస్తే..
నెల్లూరు నుంచి కొప్పుల రాజును ప్రకటించారు. ఆ జిల్లాకు కలెక్టర్‌గా పనిచేసిన ఈయన ఇపుడు రాహుల్ గాంధీ కీలక సలహా దారుల్లో ఒకరుగా ఉన్నారు. ఈయనకు నెల్లూరు జిల్లా ఎంపీ టికెట్ కేటాయించడం విశేషం.
విశాఖ పట్నం - పులుసు సత్యనారాయణ రెడ్డి..
అనకాపల్లి - వేగి వెంకటేష్
ఏలూరు - లావణ్య కావూరి
నరసరావు పేట - గార్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్
తిరుపతి (SC) - చింతా మోహన్..
ఈ లిస్టులో చింతా మోహన్ ఒక్కరే మాజీ ఎంపీగా కావడం గమనార్హం. మిగతా వాళ్లు తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు.
ఇక కడప పార్లమెంట్ నుంచి వై.యస్. షర్మిల పోటీ చేయనున్న సంగతి తెలిసిందే కదా.
ఇక అసెంబ్లీ అభ్యర్ధుల విషయానికొస్తే..
విశాఖ సౌత్ - వాసుపల్లి సంతోష్
గాజువాక - లక్కరాజు రామారావు
టెక్కలి - కిల్లి కృపారాణి
భీమిలి - అడ్డాల వెంకట వర్మరాజు
అరకు వ్యాలీ (ఎస్సీ) - శెట్టి గంగాధర స్వామి
నర్సీ పట్నం - రౌతుల శ్రీరామమూర్తి
ఎర్రగొండపాలెం (ఎస్సీ) - డాక్టర్ బి.అజితా రావు
పర్చూరు - నల్లగోర్ల శివ శ్రీ లక్ష్మీ జ్యోతి
గోపాల పురం (SC) - ఎస్. మార్టిన్ లూథర్
సంతనూతలపాడు (SC) - విజేష్ రాజు పాపపర్తి
గంగాధర నెల్లూరు (SC) - డి. రమేష్ బాబు
పూతలపట్టు (SC) - ఎం.ఎస్. బాబు
Also Read: Revanth Reddy Flight: రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం ...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter