AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 38,055 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 6,996 కరోనా కేసులు వెలుగుచూశాయి. కొవిడ్ మహమ్మారి ధాటికి గడచిన 24 గంటల్లో నలుగురు కన్నుమూశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా 1,066 మంది కొవిడ్ బాధితులు వైరస్ నుంచి విముక్తి పొందారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 36,108 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 



రాష్ట్రంలో ఇప్పటి వరకు 21,14,489 కరోనా కేసులు బయటపడ్డాయి. కరోనా నుంచి 20,63,867 మంది కోలుకున్నారు. కొవిడ్ మహమ్మారి ధాటికి రాష్ట్రంలో 14,514 మంది మృతి చెందారు. 


కొవిడ్‌ వల్ల నిన్న విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరులో ఒకరు, నెల్లూరులో ఒకరు మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,534 కరోనా కేసులు నమోదయ్యాయి. 



ఆ తర్వాత విశాఖ జిల్లాలో 1,263.. గుంటూరు జిల్లాలో 758, శ్రీకాకుళంలో 573, అనంతపురం జిల్లాలో 462, ప్రకాశం జిల్లాలో 424 కరోనా కేసులు అత్యధికంగా వెలుగు చూశాయి. 


Also Read: AP Covid Update: ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్త కేసులు ఎన్నంటే?


Also Read: Nara Lokesh Corona: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కరోనా పాజిటివ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి