COVID-19 cases in AP: ఏపీలో 24 గంటల్లో కరోనాతో 109 మంది మృతి
AP COVID-19 cases latest updates: అమరావతి: ఏపీలో నిన్నమొన్నటి పరిస్థితితో పోల్చుకుంటే తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా గుర్తించిన కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. కరోనా మృతుల సంఖ్య మాత్రం పైకే ఎగబాకుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 73,749 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 18,561 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
AP COVID-19 cases latest updates: అమరావతి: ఏపీలో నిన్నమొన్నటి పరిస్థితితో పోల్చుకుంటే తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా గుర్తించిన కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ.. కరోనా మృతుల సంఖ్య మాత్రం పైకే ఎగబాకుతోంది. గత 24 గంటల్లో ఏపీలో 73,749 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 18,561 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 14,54,052 కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 109 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 9,481 మందికి చేరింది.
కొత్తగా నమోదైన కరోనా మరణాలలో పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 16 మంది మృతి చెందగా.. గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 10 మంది చొప్పున కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో 9 మంది చొప్పున, కృష్ణా, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో 8 మంది చొప్పున, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో ఏడుగురు చొప్పున కరోనాతో మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో నలుగురు, కడప జిల్లాలో ముగ్గురు కరోనాతో మృతి చెందారు.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12,33,017 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 2,11,554 యాక్టివ్ కేసులు (COVID-19 positive cases in AP) ఉన్నాయి.