COVID-19 cases in AP: అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ.. కరోనా మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. నిత్యం కాస్త అటుఇటుగా వందకుపైగా మంది కరోనాతో చనిపోతున్నారు. శుక్రవారం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 84,502 మందికి కరోనా పరీక్షలు చేయగా వారిలో 14,429 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అదే సమయంలో 20,746 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువారం నుంచి శుక్రవారం మధ్య 24 గంటల వ్యవధిలో 103 మంది కరోనాతో కన్నుమూశారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో కరోనా మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజా బులెటిన్ ప్రకారం చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 మంది చొప్పున కరోనా రోగులు కరోనాతో చనిపోయారు. 


Also read : Telangana covid-19 cases: తెలంగాణ కరోనా లేటెస్ట్ హెల్త్ బులెటన్.. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులపై ఫోకస్


అలాగే విశాఖట్నం జిల్లాలో 10 మంది, నెల్లూరు జిల్లాలో 9 మంది, అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాల్లో 8 మంది చొప్పున కరోనా కాటుకు బలయ్యారు. గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురు, కడప, కర్నూలు జిల్లాల్లో నలుగురు చొప్పున, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనాతో (covid-19) కన్నుమూశారు.


Also read : India Corona Cases: భారత్‌లో 44 రోజుల కనిష్టానికి కరోనా పాజిటివ్ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook